Modi 3.0 : మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యింది. 100 రోజుల మోడీ పాలన ఎలా ఉంది.. 100 రోజులు అనేది టూ షార్ట్ టర్మ్. మూడోసారి రావడంతో చాలా ఫాస్ట్ గా స్పీడుగా దూసుకుపోయారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే మిగతా పీరియడ్ కంటిన్యూ చేస్తే.. గత రెండు పర్యాయాల కంటే రెట్టింపు పని జరగడం ఖాయం.. అవేంటి అన్నది చూద్దాం..
అన్నింటికంటే ముఖ్యమైనది దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన.. వీటికి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇదే అతిపెద్ద చర్యగా చెప్పొచ్చు. మౌళిక వసతులు పెరిగితేనే పెట్టుబడులు వస్తాయి.. ప్రజల జీవన పరిణామం పెరుగుతుంది.
ఇక ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ 2 లక్షల కోట్ల రూపాయిలు కేటాయించారు. నాలుగు స్కీంలు పెట్టారు. ఇందులో కోటి మంది యువతకు స్కిల్ డెవలప్ మెంట్ నాలుగేళ్లో ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుంది.
3 కోట్ల మంది పేదలకు ఇళ్లు కేటాయిస్తారు. మోడీ 3.0లో విజయాలు, వైఫల్యాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.