Homeఎంటర్టైన్మెంట్Raj Tarun : ఓటీటీలో రాజ్ తరుణ్ వివాదాస్పద చిత్రం... ఎక్కడ చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Raj Tarun : ఓటీటీలో రాజ్ తరుణ్ వివాదాస్పద చిత్రం… ఎక్కడ చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Raj Tarun : ఇటీవల రాజ్ తరుణ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. పదేళ్లకు పైగా తనతో సహజీవనం చేస్తున్న రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూస్తున్నాడు. రాజ్ తరుణ్ నన్ను గుడిలో రహస్య వివాహం చేసుకున్నాడు. అబార్షన్ కూడా చేయించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను దూరం పెడుతున్నాడు… అని లావణ్య ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా లతో పాటు ఆమె తమ్ముడు మీద కూడా లావణ్య కేసు పెట్టింది.

ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. కాగా లావణ్య ఆరోపణలు చేసిన మాల్వి మల్హోత్రా తిరగబడర సామీ చిత్రంలో రాజ్ తరుణ్ తో జతకట్టింది. ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా తిరగబడర సామీ మూవీ సెట్స్ లో దగ్గరయ్యారు. వారి పరిచయం ప్రేమకు దారి తీసింది అనేది లావణ్య వాదన.

లావణ్య ఆరోపణలను మాల్వి మల్హోత్రా ఖండించింది. రాజ్ తరుణ్ నాకు సహ నటుడు మాత్రమే. అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారు. మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం విశేషం. మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలియదు కానీ… ఆమె కారణంగా చిక్కుల్లో పడ్డాడు.

ఇక తిరగబడర సామీ ఓటీటీ డిటైల్స్ పరిశీలిస్తే.. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తిరగబడర సామీ కథ ఏమిటంటే?

తప్పి పోయిన, కనబడకుండా పోయిన వ్యక్తుల జాడ తెలుసుకుని, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుస్తూ ఉంటాడు గిరి(రాజ్ తరుణ్). అతడు అనాథ కావడంతో ఈ బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో తన వలె అనాథ అయిన శైలజ(మాల్వి మల్హోత్రా) పరిచయం అవుతుంది. ఆమెను వివాహం చేసుకుంటాడు గిరి. అయితే శైలజ అనాథ కాదని తెలుసుకుంటాడు. అసలు శైలజ ఎవరు? గిరి జీవితంలోకి ఎందుకు వచ్చింది? కొండారెడ్డి అనే గూండాకు శైలజకు ఉన్న సంబంధం ఏమిటీ? అనేది మిగతా కథ..

Tiragabadara Saami Trailer | Raj Tharun, Malvi Malhotra | Ravi Kumar | JB | Shiva Kumar

Exit mobile version