Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేయడమే కాకుండా తనను తాను సినిమా ఇండస్ట్రీకి చాలా ఉన్నతమైన రీతిలో పరిచయం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఏపీ లో డిప్యూటీ సీఎం గా భాద్యతలను కొనసాగిస్తూ జనానికి ఉన్న అవసరాలను తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలా మీద కూడా ఎక్కువమందికి ఫోకస్ అయితే ఉంది. ఇంకా తను ఇప్పటికే సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలను తొందరలోనే ఫినిష్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే తొందర్లోనే ఆ సినిమా షూటింగ్లకు సంబంధించిన డేట్స్ ని కూడా కేటాయించడానికి తను సిద్ధమవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే కొంతమంది స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేసిన వాళ్ల కెరియర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకి సక్సెస్ తో పాటు స్టార్ డమ్ కూడా వస్తూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా చేసిన వాళ్లకి లాంగ్ కెరియర్ అయితే ఉండదు అనే ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆయన పక్కన చేసిన ఒక్కరిద్దరు హీరోయిన్ల ను మినహాయిస్తే మిగిలిన వారేవ్వరికి పెద్దగా స్టార్ డమ్ అయితే దక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో మనం ఎక్కువగా ఆయననే చూస్తూ ఉంటాము. దానివల్లే సినిమా అనేది సూపర్ సక్సెస్ గా నిలుస్తుంది. కానీ హీరోయిన్లకు పర్ఫామెన్స్ పరంగా అంత స్కోప్ అయితే ఉండదు.
ఒకవేళ వాళ్ళు పాటలకి, స్కిన్ షో కి పరిమితమైనప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం వాళ్లకు పెద్దగా గుర్తింపు ఉండదు. అలాగే ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగలేకపోతుంటారు. ఇక బాలు, బంగారం,తమ్ముడు, బద్రి, పంజా, తీన్ మార్ సినిమాల్లో చేసిన హీరోయిన్స్ కి ఆ తర్వాత పెద్దగా కెరియర్ లేకుండా పోయింది. నిజానికి ఆయన స్టార్ హీరో అయినప్పటికి అప్ కమింగ్ హీరోయిన్ల విషయం లో మాత్రం ఆయన విలన్ అనే చెప్పాలి…
ఇక సమంత, కాజల్, ఇలియానా లాంటి హీరోయిన్ల విషయానికి వస్తే వాళ్ళు టాప్ హీరోయిన్లు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో నటించారు. కాబట్టి ఆ తర్వాత కూడా వాళ్ళ స్టార్ డమ్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక అప్ కమింగ్ హీరోయిన్లు పవన్ కళ్యాణ్ తో చేస్తే మాత్రం వాళ్ళు పెద్దగా సక్సెస్ సాధించలేరనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన అభిమానుల గుండెల్లో శిఖరంలా ఉంటాడు.
కాబట్టి అతని పక్కన ఎవరు నిలుచున్న పెద్దగా కనిపించరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేస్తే స్టార్ డమ్ అయితే దక్కుతుంది. కానీ ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేరనేది మాత్రం వాస్తవం…