నిన్న రాహుల్ గాంధీ చాలా హడావుడి చేసి వెళ్లాడు. దాన్ని ఒక పెద్ద అంశంగా చిత్రీకరించారు. ఆర్భాటం చేశారు. యూపీఏ ప్రభుత్వమే సోషల్ ఎకనామిక్ సర్వేను గతంలో నిర్వహించింది. చేసి దాన్ని రిలీజ్ చేయలేదు. తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా సర్వే చేశారు. జనంలో ప్రచారం కోసం చేయడం తప్పితే.. ఈ కులగణన అనేది ఒక ప్రచార ఆర్భాటంగా చెప్పొచ్చు.
బీహార్ లో సీఎం నితీష్ గత సంవత్సరం చేసిన కులగణన సర్వే ఇప్పటీకీ అతీగతీ లేదు.కొత్తగా తెలంగాణలో చేస్తున్నట్టు రాహుల్ గాంధీని పిలిచి జనం మోకరిల్లడం చూస్తుంటే ఇదంతా ఓ నాటకంగా చెప్పొచ్చు.
తెలంగాణలో బీసీలు 50 శాతంగా ఉన్నారు కదా ఇక్కడ ముఖ్యమంత్రిని ఎందుకు బీసీనేతను చేయలేదు అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. జమ్మూకశ్మీర్లో రిజర్వేషన్ల గొడవపై అంత ఆందోళన జరుగుతుంటే వాటిపై పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నోరుమెదపడం లేదు. ముసలి కన్నీరు కారుస్తోంది.
తెలంగాణను బంద్ పెట్టి చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమయింది? కాంగ్రెస్ సర్కార్ కులగణనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు