Odisha : ఒడిశా ఈసారి నువ్వా.. నేనా అన్నంత హోరాహోరీగా జరుగుతోంది. బీజేపీ, బీజేడీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ అసలు సోదీలోనే లేకుండా పోయింది. ఆ పార్టీని పట్టించుకునే వారే లేరు. ఒడిశాలో బీజేపీ గ్రాఫ్ అధికారంలోకి వచ్చేంతగా ఉందని సెఫాలజిస్టులు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేరు. ఇప్పటికే వరుసగా ఐదుసార్లు గెలిచిన నవీన్ పట్నాయక్ ను తట్టుకొని గెలవడం అంటే ఒడిశాలో మామూలుగా కాదు. ఇప్పటికే ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. 24 సంవత్సరాలుగా ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడూ ఎవరినీ ఒక మాట అనని వ్యక్తి. మితభాషి. ఇంతవరకూ ఆయనపై అవినీతి మచ్చలేదు. స్తితప్రజ్ఞుడు నవీన్ పట్నాయక్..
ప్రధాని మోడీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మధ్య మంచి సంబంధాలున్నాయి. అయితే ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ కూడా నవీన్ పట్నాయక్ పై విమర్శలు చేశాడు. కానీ నవీన్ మాత్రం వీటికి ఏమాత్రం కౌంటర్ ఇవ్వకుండా మోడీని గౌరవించాడు..
ఇప్పుడు ఒడిశాలో నవీన్ పట్నాయక్ అనారోగ్యం.. ఈసారి సీఎం రేసులో లేకపోవడంతో ఆ పార్టీ ప్రతిష్ట ప్రజల్లో దిగజారింది. వేరే రాష్ట్ర వ్యక్తిని నవీన్ తన వారసుడిగా ప్రకటించడంతో బీజేడీకి అవకాశాలు తగ్గి బీజేపీకి పెరిగాయి.
మంచి ఊపు మీదున్న ఒడిశా బీజేపీకి పూరీజగన్నాధుని షాక్ తగిలింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు