https://oktelugu.com/

Priyanka Gandhi : ప్రియాంక గాంధీ పార్లమెటు ప్రవేశంతో కాంగ్రెస్ లో అంతర్గత మార్పులు?

Priyanka Gandhi : ప్రియాంక గాంధీ పార్లమెటు ప్రవేశంతో కాంగ్రెస్ లో అంతర్గత మార్పులు? జరుగుతాయా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : June 20, 2024 / 03:08 PM IST

Priyanka Gandhi : ప్రియాంక గాంధీ పార్లమెంట్ రంగప్రవేశం ఖరారైంది. వయనాడు ఎన్నిక అనేది కేవలం ఒక సహజ ప్రక్రియ మాత్రమే. వయనాడ్ లో ప్రియాంక గాంధీ ఎలాగూ గెలుస్తుంది. మళ్లీ పార్లమెంట్ గడప తొక్కుతుంది.

ప్రియాంక యూపీ నుంచి కనుక గెలిచి ఉంటే ఇంకా బాగుండేది. ఢిల్లీకి వయా యూపీ అనేది చాలా ఇంపార్టెంట్. పోయిన జనరల్ ఎలక్షన్స్ లోనే రాయ్ బరేలి నుంచి ప్రియాంక, అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తారని అందరూ ఊహించారు. కానీ మధ్యలో ఏం జరిగిందో కానీ ప్రియాంక పోటీ నుంచి నాడు విరమించుకున్నారు.

రాహుల్ గాంధీ ఎంపీగా మన్మోహన్ హయాంలోనే రంగప్రవేశం చేశారు. దురదృష్టవశాత్తు అది క్లిక్ కాలేదు.. ప్రియాంక గాంధీ రీసెంట్ ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక అందరితోనూ కలిసిపోతుంది. నవ్వుతూ మాట్లాడుతుంది. కూల్ గా రాజకీయాలు చేస్తుంది.

ప్రియాంక గాంధీ లోకల్ ఇష్యూలను టచ్ చేస్తూ జనంతో మమేకమయ్యారు. జనం ప్రియాంకలో ఇందిరాగాంధీని చూసుకుంటున్నారు.

ప్రియాంక గాంధీ పార్లమెటు ప్రవేశంతో కాంగ్రెస్ లో అంతర్గత మార్పులు? జరుగుతాయా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ప్రియాంక గాంధీ పార్లమెటు ప్రవేశంతో కాంగ్రెస్ లో అంతర్గత మార్పులు? || Priyanka Entry Into Parliament