Priyanka Gandhi : గత వారం ఢిల్లీలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరిది అయిపోయింది. రెండోది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రియాంక గాంధీ వైపు క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇవి వేగమందుకున్నాయి.
పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ తర్వాత కాంగ్రెస్ లో అంతర్గత పరిణామాలు వేగంగా మారాయి. ఇండీ కూటమిలో రాహుల్ చేసిన హంగామాతో శరద్ పవార్ కాంగ్రెస్ తీరును తప్పుపట్టాయి. ఈ అంశంలో టీఎంసీ, సమాజ్ వాదీ కూడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాయి.
కాంగ్రెస్ ఇండియా కూటమి బాధ్యతలను రాహుల్ గాంధీ ల కంటే టీఎంసీ అధినేత్రి మమతకు అప్పగించాలని కూటమి నేతలు కూడా చెబుతుండడం సంచలనమైంది. ఇండీ కూటమిలో కాంగ్రెస్ మీద అన్ని పార్టీలు పెదవి విరుస్తున్నాయి.
అంతర్గతంగా కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ నాయకత్వం కావాలని పెరుగుతున్న ఒత్తిడి పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.