Lucky Bhaskar Movie : రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా చాలా మందికి నచ్చింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఓటీటీలో మంచి టాక్ తో దూసుకొని పోతుంది. మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా మరింత ఎక్కువగా నచ్చేసింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా వచ్చింది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 11న ట్రైలర్‌ను అక్టోబర్ 21న విడుదల చేశారు. ఇక సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది.
ఈ సినిమా రూ.30 కోట్లతో నిర్మించగా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఈ సినిమా రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా నిలిచింది. ఇక రీసెంట్ గా అంటే నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు మరింత మంది అభిమానులు అయ్యారు. ఇక ఈ సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు వైరల్ అవుతున్నాయి. కానీ అవి నిజంగా జీవిత సత్యాలే. ఇంతకీ వాటిని మీరు గమనించారా?
ఈ సినిమాలోని సంభాషణలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందుకే అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 1..ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికే జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చోలేను కదా అనే డైలాగ్ ఉంటుంది.2… పోతే నా ఒక్కడి జీవితం. బాగుపడితే నా మొత్తం కుటుంబం అనే డైలాగ్ కూడా ఎంతో మందికి నచ్చింది.3.. ఒక్కరోజులో నేను చాలా కోల్పోయా.. ఇక చాలు ఇంటికి గెలిచే వెళ్తా అనే డైలాగ్ భలే ఉంది కదా.
4..లాభం వచ్చినప్పుడే కాదు.. కష్టం వచ్చినప్పుడు కలిసే ఉండాలి. 5.. మిడిల్ క్లాస్ మెంటాల్టీ సర్.. ఖర్చులన్నీ తగ్గించుకొని ప్రతి రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే ఒక్క రూపాయి మిగలకుండా అంతా ఖర్చు పెట్టేస్తాం.6.. సిగరేట్, డ్రగ్స్, ఆల్కహాల్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కుక్కు ఎక్కువ వంటి డైలాగులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.
7..జూదం ఎంత గొప్పగా ఆడామన్నది ముఖ్యం కాదు.. ఎప్పుడు ఆపాము అనేది ముఖ్యం. 8..గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తు ఉంటుంది. ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలిచి పోతుంది. ఎందుకంటే ఎలా ముగించామన్నదే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. 9..ఏడ్చి గోల చేయడం కంటే నవ్వుతూ తప్పు కోవడం మంచిది. 10..దిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనబడాలి. 11..వేగంగా నడిపే బండి వేగంగా వచ్చే రూపాయి ఎప్పుడో ఒకప్పుడు మనిషిని కింద పడేస్తాయి. 12..థాంక్యూ సర్ నమ్మినందుకు.. థాంక్యూ సర్ నమ్మకం నిలబెట్టుకున్నందకు..13..దేవుడి రెడ్ సిగ్నల్ వేశాడు అంటే అన్నీ ఆపేయమని అర్థం. ఈ డైలాగులు మొత్తం కూడా ఆ సినిమాలో ఉన్నాయి.