Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అడవితల్లి బాటలో వేసిన అడుగులు.. చేసిన బాసలు గిరిజనుల గుండెలను కదిలించాయి. ఇన్నాళ్లకు తమ తరుఫున మాట్లాడే నాయకుడు దొరికాడని గిరిజనులు ఆనందోత్సాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం వాగులు వంకలు దాటి గిరిజనులను పలకరించాడానికి వచ్చిన పవన్ పై వారు అభిమానం చూపించారు. నేనున్నానని మీ కోసం అంటూ వచ్చిన నాయకుడిని చూసి జనం పులికించిపోయారు.
ఇవి లేకనే కదా గిరిజనులు అనేక సార్లు మావోయిస్టుల పంచన చేరి వారికి ఆశ్రయం కల్పించారు. ఇవి లేకనే గంజాయి సాగు చేసి వక్రదారి పట్టారు. ఈ ఆప్యాయత లేకనే బాధ్యత లేకుండా కార్చిచ్చులకు కారణమయ్యారు. ఇవి అధికారం దర్పంతో వెళ్లినది కాదు.. వాళ్లల్లో ఒకడిగా వారి పెద్దన్నగా మారిన పవన్ కళ్యాణ్ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
గిరిజనుల జీవితాల బాగోగుల కోసం పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటిస్తూ వారి సమస్యలు తీరుస్తున్నారు. 10 కుటుంబాలున్నా అక్కడికి రోడ్డు వేస్తామని.. సంక్షేమం, అభివృద్ధి చేస్తామని.. చేతబడులు మూడనమ్మకాలు వీడాలని పవన్ గిరిజనులకు సూచించారు.
టూరిజం తరుఫున ఉద్యోగాలు.. టూరిజం డెవలప్ చేసి ఉపాధి కల్పిస్తామని పవన్ మన్యంలో పర్యటిస్తూ గిరిజనుల బతుకుకు భరోసా కల్పించారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
