Pakistan : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్పినట్టు.. ‘పాకిస్తాన్ పవిత్ర ముస్లిం దేశమని.. అసలు ప్రాఫిట్ మహ్మద్ స్థాపించిన ఆ నాటి ఇస్లాం రాజ్యం తర్వాత మాదే పవిత్ర ఇస్లాం దేశంగా గొప్పలు చెప్పుకున్నాడు. వాస్తవానికి అది ఇవ్వాళ చెప్పడంలో అర్థం లేదు. 1971లో బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ కోల్పోయిన తర్వాత ఇలాంటి మాటల మాట్లాడడం లో అర్థం లేదు.
జిన్నా పాకిస్తాన్ ను ఏర్పాడ్డాక ఎక్కవ కాలం పాలించలేదు. కేవలం ఏడాది పాలించి క్యాన్సర్ తో మరణించాడు. తర్వాత సైనిక పాలనలోనే పాకిస్తాన్ ఎక్కువ కాలం మగ్గింది. ఆర్మీ చేతుల్లోనే ఇప్పటికీ కొనసాగుతోంది. పాక్ ఆర్మీ చేతుల్లో లేకుంటే దేశం ముక్కలు ముక్కలు అయ్యేది. జనానికి ఆర్మీ మీద మంచి అభిప్రాయం ఉంది.
ఇవాళ పాకిస్తాన్ దేశంగా నిలబడడానికి కారణం ఆర్మీయని చెబుతారు. గతం నుంచి మిలటరీ పాలకులు ఇస్లాం మీద ఆధారపడ్డ వారు కాద. కానీ జియాహుల్ హక్ వచ్చిన తర్వాతనే ఇస్లాం భావజాలాన్ని పాకిస్తాన్ ఆర్మీలో బలంగా చొప్పించాడు.
సైన్యంపై పంజాబీలపై పాకిస్తాన్ లో మిగతా జాతుల తిరుగుబాటుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.