Amaravati : నేడు అమరావతి పునః ప్రారంభోత్సవ వేడుక ఎంత ఘనంగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథి విచ్చేసి, సుమారుగా 57 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాడు. ఎంతో హృద్యంగా సాగిన ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉపన్యాసాలు బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కి చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చిన ఘటన సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి ఎన్నో ఘటనలకు వేదికగా ఈ కార్యక్రమం నిల్చింది. ముఖ్యంగా మోడీ తెలుగు లో ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేయడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : మూడేళ్లలో అమరావతి.. ఆంధ్ర కలను నిజం చేసే దిశగా ప్రధాని కీలక ప్రకటన
మోడీ హిందీ లో ఇచ్చే ఉపన్యాసాన్ని తెలుగు లోకి అనువాదం చేసి జనాలకు వినిపించే వ్యక్తి పక్కనే ఉన్నప్పటికీ, మోడీ తెలుగు లో మాట్లాడే ప్రయత్నం చేయడం నిజంగా హర్షణీయం. ఆయన మాట్లాడుతూ ‘అమరావతి కేవలం ఒక నగరం కాదు..ఒక శక్తి’ అంటూ పవర్ ఫుల్ గా ఆయన మాట్లాడిన మాటలకు సభ దద్దరిల్లింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. అనంతరం రెండవ సారి ఆయన తెలుగు లో మాట్లాడుతూ ‘వికసిత్ భారత్ 2047..చంద్రబాబు గారు..తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు..ఇది మనం చేసి తీరాలి. కచ్చితంగా మనమే చేసి తీరాలి’ అంటూ మరోసారి పవర్ ఫుల్ గా తెలుగు లో ఉపన్యాసం ఇచ్చాడు ప్రధాని మోడీ. మరో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే పీఎం మోడీ చంద్రబాబు నాయుడు ని ఆకాశానికి ఎత్తేయడం. ఇలా మోడీ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆయన ఏమి మాట్లాడాడంటే ‘నేను గుజరాత్ కి ముఖ్యమంత్రి అయ్యినప్పుడు..ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఆయన ఆరోజుల్లో హైదరాబాద్ కి ఐటీ ని తీసుకొచ్చాడు. అది బాగా డెవలప్ అవ్వడం ని చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా గుజరాత్ లో ఐటీ ని నెలకొల్పాలి అనే సంకల్పం తో ఉన్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో డెవలప్ చేసిన ఐటీ మోడల్ ని అధ్యయనం చేసాను. అందుకోసం నేను ప్రత్యేక బృందాన్ని కూడా హైదరాబాద్ కి పంపించాను. ఈరోజు గుజరాత్ ఐటీ రంగం లో ఇంతలా దూసుకొని వెళ్తుందంటే, అందుకు చంద్రబాబు గారు కూడా పరోక్షంగా కారణమే’ అంటూ మోడీ సీఎం చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Modi speaking flawlessly in Telugu
అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి – ప్రధాని మోడీ #AmaravatiTheRise pic.twitter.com/Xaef52fT2W
— Vineeth K (@DealsDhamaka) May 2, 2025