https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఈ వారం ఏకంగా నాలుగు ఎలిమినేషన్లు..లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్..ఇదేమి ట్విస్ట్ బిగ్ బాస్!

సోషల్ మీడియా లో బిగ్ బాస్ పీఆర్ టీం తో కనెక్షన్స్ ఉన్నటువంటి యూట్యూబర్లు ముందుగానే ఆడియన్స్ కి లీకులు అందిస్తున్నారు. ఈ సీజన్ లో హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా అడుగుపెట్టారు. 14 మంది కంటెస్టెంట్స్ తో 16 వారాలు బిగ్ బాస్ హౌస్ నడవలేదు అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. భవిష్యత్తులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొంత మంది కంటెస్టెంట్స్ కూడా వస్తారని తెలుసు.

Written By:
  • Vicky
  • , Updated On : September 25, 2024 / 06:58 PM IST

    Bigg Boss Telugu 8(45)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా, ప్రతీ రోజు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఇప్పుడు నాల్గవ వారం లోకి అడుగుపెట్టింది. సాధారణంగా టాస్కులు చివరి వారాల్లో కఠినం అవుతుంటాయి. కానీ ఈ సీజన్ లో మాత్రం ప్రారంభం నుండే టాస్కులు కఠినంగా ఉండడం, అలాగే హౌస్ లో గొడవలు కూడా తారా స్థాయిలో ఉండడం కారణంగా టీఆర్ఫీ రేటింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో నమోదు అవుతున్నాయి. అంతే కాదు ఈ సీజన్ లో ట్విస్టులు కూడా ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ లో తర్వాత ఏమి జరగబోతుంది అనేది ఆడియన్స్ కి గత సీజన్ లో అర్థం అయ్యేది.

    ఎందుకంటే సోషల్ మీడియా లో బిగ్ బాస్ పీఆర్ టీం తో కనెక్షన్స్ ఉన్నటువంటి యూట్యూబర్లు ముందుగానే ఆడియన్స్ కి లీకులు అందిస్తున్నారు. ఈ సీజన్ లో హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా అడుగుపెట్టారు. 14 మంది కంటెస్టెంట్స్ తో 16 వారాలు బిగ్ బాస్ హౌస్ నడవలేదు అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. భవిష్యత్తులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొంత మంది కంటెస్టెంట్స్ కూడా వస్తారని తెలుసు. వైల్డ్ కార్డు ద్వారా 6 మంది కంటెస్టెంట్స్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా 12 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్టు బిగ్ బాస్ కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో లో తెలియచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు హౌస్ వాళ్ళ రాక కారణంగా కొంతమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. ఈ వారం లో 12 టాస్కులు నిర్వహించబోతున్నారు. ఈ 12 టాస్కులలో ఎన్ని టాస్కులు కంటెస్టెంట్స్ గెలుస్తారో, అన్ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని తప్పించొచ్చు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వారం నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

    ఇది షాకింగ్ ట్విస్ట్ గా ఉండబోతుందని సమాచారం. ఈ వారం నామినేషన్స్ లోకి మణికంఠ, సోనియా, పృథ్వీ రాజ్, ప్రేరణ, ఆదిత్య ఓం మరియు నబీల్ వచ్చారు. వీరిలో ప్రస్తుతం నబీల్, ప్రేరణ భారీ ఓటింగ్ మార్జిన్ తో టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. మిగిలిన నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఈ నలుగురిలో ఇద్దరినీ శనివారం ఎపిసోడ్, మరో ఇద్దరినీ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేయబోతున్నారట. ఒకవేళ ఇలా కుదరకపోతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని నిర్వహించి, వచ్చే వారం మరో డబుల్ ఎలిమినేషన్ ని నిర్వహించబోతున్నారట. ఎట్టి పరిస్థితిలో నలుగురు కంటెస్టెంట్స్ ని అయితే బయటకి పంపేందుకు బిగ్ బాస్ టీం సన్నాహాలు చేస్తుంది.