SC Subcategories : మాయావతి, చిరాగ్ పాశ్వాన్ లు ఉపవర్గీకరణకు వ్యతిరేకం

మాయావతి, చిరాగ్ పాశ్వాన్ లు ఉపవర్గీకరణకు వ్యతిరేకం.. మోడీ దీన్ని ఎలా పరిష్కరిస్తారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : August 7, 2024 2:50 pm

సుప్రీంకోర్టు షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ విషయమై స్పష్టమైన తీర్పునిచ్చింది. దీని బ్యాక్ గ్రౌండ్ కు వెళ్లినట్లయితే .. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోడీ-మంద కృష్ణ భావోద్వేగ కలయిక అందరికీ గుర్తుంది. మోడీ నాడే మందకృష్ణకు హామీనిచ్చాడు. ఎస్సీ వర్గీకరణపై ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు జనరల్స్ ను సుప్రీంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించేలా చేశాడు.

సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. క్రీమిలీయర్ ను అమలు చేయాలని సూచించింది. ఎస్సీ ఉప వర్గీకరణ దక్షిణాది రాష్ట్రాల వరకూ చేయవచ్చు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది వీలుకాదు. సున్నితమైన అంశంగా ఇది మారింది.

ఉత్తరప్రదేశ్ లో చూస్తే.. డ్యామినేట్ క్యాస్ట్ లు ఉన్నాయి. మాయవతి క్యాస్ట్ వర్గాలు (జాక్) ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను ఒప్పుకోం అని ఎన్డీఏ మిత్రపక్షం చిరాగ్ పాశ్వన్ స్పష్టం చేశారు. మోడీ అనుకూలంగా ఉన్నా 5 ఎంపీలున్నా చిరాగ్ పార్టీ ఒప్పుకోవడం లేదు. ఒకవైపు కమిట్ మెంట్.. మరోవైపు ఎన్డీఏ పక్షాలను ఒప్పించాల్సిన బాధ్యత మోడీపై ఉంది.

మాయావతి, చిరాగ్ పాశ్వాన్ లు ఉపవర్గీకరణకు వ్యతిరేకం.. మోడీ దీన్ని ఎలా పరిష్కరిస్తారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.