Gilgit Baltistan : గిల్గిట్ బాల్టిస్తాన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ గా ఉంది. భారత చిత్రపటంలో పైన ఉండేది ఈ భాగమే. సాంకేతికంగా ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పరిగణిస్తున్నారు. కానీ సంస్కృతికపరంగా చూస్తే కశ్మీర్ లో భాగం. అసలు వీరు కశ్మీరీలు కాదు. అనేక జాతులు, భాషలు మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారు. పేరుకు ఇస్లాం మతం అయినా ఎన్నో తెగలకు పుట్టినిల్లు ఈ ప్రాంతం.
షియాలు 40 శాతం బాల్టిస్తాన్ లో ప్రధానంగా ఉంటారు. దానికింద సున్నీలు 30 శాతం ఉంటారు. షియాలోని మరో తెగ 25 శాతం మంది ఉంటారు. నూర్ భాష వాళ్లు 6 శాతం గా ఈ ప్రాంతంలో ఉన్నారు.
1974లోనే ఈ ప్రాంతానికి పొటెస్ట్ ఉండేది. సున్నీలు, పస్తున్లు, పంజాబీలను ఆహ్వానించి అక్కడ భూములు కొనలాని పాకిస్తాన్ పిలుపునిచ్చింది. ఒకప్పుడు ఇక్కడ షియాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిచింది. గిల్గిట్ బాల్టిస్తాన్ సాంస్కృతికంగా కశ్మీర్ లో భాగం కాదు.
మొత్తం పర్వతాలతో అత్యంత ఎత్తైన కొండలతో అప్ఘన్, చైనా, పాక్ సరిహద్దులకు గేట్ వేగా పిలవబడుతోంది. బ్రిటిన్-రష్యా గ్రేట్ గేమ్ లో ఈ ప్రాంతం కీలకమైంది.
1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది. కశ్మీర్ మహారాజు భారత్ లో కలవడానికి అంగీకరించి కలిపారు. అయితే గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా భారత్ లో విలీనమైంది. అయితే బ్రిటీష్ అధికారులు ఈ ప్రాంతంపై కుట్ర చేసి గవర్నర్లను మార్చి ఈ ప్రాంతం స్వాతంత్ర్యం ప్రకటించుకొని తర్వాత పాకిస్తాన్ లో కలిపేశారు.
పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
