Kashmir : ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని రాజకీయ పండితులు సూచిస్తుంటారు. మోడీ కూడా అదే చేస్తుంటారు. కోవిడ్ సంక్షోభంలో భారత్ ఆత్మనిర్భర భారత్ కింద మారడానికి పెద్ద ముందడుగు పడింది. పహల్ గాం దుర్ఘటనతో రాడికల్ ఇస్లాం మీద, పాకిస్తాన్ మీద దేశ ప్రజలకు కసి పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా కశ్మీరీలు కూడా పాక్, రాడికల్ ఇస్లాం మీద మొట్టమొదటి సారి కసి ఏర్పడింది.
మెజార్టీ కశ్మీరీలు ఈసారి ఉగ్రవాదానికి వ్యతిరేకమయ్యారు. ఉగ్రవాదులు ఇంతమంది టూరిస్టులను చంపిన దాఖలాలు లేవు. ఇది మొదటి కారణం.. గత రెండు మూడేళ్లుగా కశ్మీరీలకు ఆదాయం విపరీతంగా పెరిగింది. పోయిన సంవత్సరం 2.15 కోట్ల మంది జనం కశ్మీర్ కు వచ్చారు. వారికి ఉపాధి పెరిగింది. వ్యాపారం పెరిగింది. హోటల్స్ ఖాళీలేవు.
అటువంటి వాటన్నింటిపై ఉగ్రవాద దాడితో కశ్మీరీలకు జీవనోపాధి మొత్తం దూరమైంది. ఇది పాకిస్తాన్ పై వ్యతిరేకతకు కారణమైంది. దీంతో కశ్మీరీలు భారత్ కు దగ్గరయ్యారు. ఇది భారత్ అవకాశంగా మలుచుకోవాలి. ప్రజల మద్దతు దక్కడంతో ఇప్పుడు ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించే ప్లాన్ ను కేంద్రం అమలు చేయాలి.
ఇస్లామిక్ తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ని శత్రువులుగా చూస్తున్న కాశ్మీరీలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
