Manipur : మయన్మార్.. కొరకరాని కొయ్యలాగా తయారైంది. పరిష్కారం కనిపించడం లేదు. మోడీ ఆ దేశానికి ఇప్పటివరకూ వెళ్లలేదని అంటున్నారు.పరిష్కారం ఎందుకు దొరకదో ఆలోచించాలి. ఈశాన్య భారతంలో మోడీ వచ్చాక జరిగిన ఒప్పందాలు అంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని రాష్ట్రాల్లో తీవ్రవాదులతో ఉద్యమకారులతో ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం.
కానీ మణిపూర్ లో మాత్రం శాంతి నెలకొనడం లేదు. ఇక్కడ మూడ వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. మణిపూర్ లో సమస్య తీవ్రంగా ఉంది.మణిపూర్ లో మూడు జాతులు మైతీలు, కుకీలు, నాగాలు ఉంటారు. మైతీలు 50 శాతం, 24 శాతం నాగాలు, 17 శాతం కుకీలు ఉంటారు. ఇదీ వారి చరిత్ర.
స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి ఎన్నో తీవ్రవాద సంఘాలతో ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. నెహ్రూ నుంచి మోడీ వరకూ అన్ని ఒప్పందాలు జరిగాయి. కానీ మణిపూర్ లో మాత్రం ఒప్పందాలు జరగలేదు.
మయన్మార్ కి పరిష్కారం దొరికితేనే మణిపూర్ కి పరిష్కారం? మణిపూర్ రాష్ట్రంలోని చరిత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.