Vijay TVK rally stampede: కరూర్ దుర్ఘటన.. అత్యం విషాదకరమైనది.. 41 మంది చనిపోయారు. మహిళలు, చిన్నారులు ఉండడం కలిచివేస్తోంది. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సభలోనూ ఇదే జరిగింది. తిరుమలలోనూ ఈ విషాదాలు వెంటాడుతున్నాయి..
ఇంత జరుగుతున్నా పోలీస్ డిపార్ట్ మెంట్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదా? ఒక తప్పు జరిగిదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతీసారి ఇదే జరుగుతోంది.
సెలబ్రెటీ అయిన విజయ్ మీటింగ్ కు ఎక్కువగా జనం వచ్చారు. అనుకున్నదాన్ని మించారు. పోలీస్ డిపార్ట్ మెంట్ అన్ని ఆంక్షలు పెట్టారు. విశాలమైన వేదికలు ఇవ్వకుండా పోలీసులు ఈ దుశ్చర్య జరగడానికి కారణమైంది. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పోలీసులు చెప్పే కారణాలుకూడా సిల్లీగా ఉన్నాయి. విజయ్ చెప్పిన టైంకు రాలేదు. మధ్యలోంచి వచ్చాడు. జనం విపరీతంగా వచ్చారు.
విజయ్ పర్యటనలో 500 మంది పోలీసులు లేరని.. 100 మంది మాత్రమే ఉన్నాయని బీజేపీనేత అన్నామలై అనడంతో ఇది ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తోంది.
కరూర్ దుర్ఘటనతో తమిళ రాజకీయాలు మారబోతున్నాయా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.