Rahul Gandhi : రెండు రోజులు అహ్మదాబాద్ లో ఏఐసీసీ సెషన్ జరిగింది. కాంగ్రెస్ అత్యున్నత బాడీ మీటింగ్ లో అందరూ చర్చించారు. చివరి రోజు రాహుల్ గాంధీ ప్రసంగం హైలెట్. చాలా విషయాల మీద మాట్లాడారు. రాహుల్ ప్రసంగంలో హైలెట్ చేసింది ఏంటంటే.. తెలంగాణ పాలన నమూనాను పొగిడాడు. అదే‘రేవంత్ రెడ్డి పాలన నమూనను’ కొనియాడారు.
మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎలా చేస్తామో.. తెలంగాణ పాలన రోల్ మోడల్ అంటూ రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించాడు. దీనికి ప్రధానంగా ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ‘కులగణన’. 90 శాతం అణగారిన వర్గాలకు సంబంధించింది.. 50 శాతం ఉన్న రిజర్వేషన్ అడ్డుగోడలను తొలగిస్తాం. తెలంగాణలోని కార్పొరేట్ లో కూడా ఎక్కువగా ఉన్నత వర్గాల వారు ఉన్నారు.
ఇక అమెజాన్, స్విగ్గీలో పనిచేసే వారిలో ఎక్కువ అణగారిన ఎస్సీ, ఎస్టీ బీసీలే ఉన్నారు. అసలు రాహల్ చెప్పిన అంశాన్నే మనం ముందుగా తీసుకుందాం. జనాభాలో 90శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నాడు. 10 శాతం అగ్రవర్ణాల వారు అన్నారు. ఆ ప్రకారం వారికి లబ్ధి చేకూరడం లేదని.. అందుకే బీసీ రిజర్వేషన్ చేసి పంపిస్తే కేంద్రం ఒప్పుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు.
తెలంగాణ నమూనా రాహుల్ గాంధీకి నచ్చింది మరి ప్రజలకో? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
