Virat Kohli : ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన దూకుడుతో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు జట్టు సాధించే విజయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏకంగా మన జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కి సమీపంలో ఉన్నాడు. ఇంతకీ ఏ విషయంలో అంటే..
Also Read : విరాట్ కోహ్లీ అభిమాని రచయిత అయ్యాడు.. నవల కూడా రాశాడు..
మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ ను ఆశ్రయిస్తాం. మరింత లోతుగా సమాచారం కావాలంటే వికీపీడియాను అడుగుతాం. వికీపీడియా అనేది సమగ్రమైన సమాచారం అందిస్తుంది. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే సవరించి వాస్తవాలను మాత్రమే కళ్ళ ముందు ఉంచుతుంది. అయితే వికీపీడియాలో నిత్యం కోట్ల కొలది సెర్చింగులు జరుగుతుంటాయి. దేశాల వారీగా ప్రజలు ఎలాంటి విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారు వికీపీడియా ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. అయితే మన దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ గురించి వికీపీడియాలో తెగ సెర్చ్ చేశారట. వికీపీడియాలో మహాత్మా గాంధీ గురించి.. ఆయన చేసిన ఉద్యమాల గురించి తెలుసుకున్నారట. ఈ లెక్క ప్రకారం మన దేశం మాత్రమే కాదు ఆసియా మొత్తంలోనే మహాత్మా గాంధీ గురించి వికీపీడియాలో 65 మిలియన్ల మంది సెర్చ్ చేశారట. ఇప్పటివరకు అత్యధిక సెర్చింగ్ పర్సనాలిటీగా మహాత్మా గాంధీ నిలిచారని వికీపీడియా తెలిపింది. ఇక మహాత్మా గాంధీ తర్వాత విరాట్ కోహ్లీ ఆస్థానాన్ని ఆక్రమించారని వికీపీడియా ప్రకటించింది. విరాట్ కోహ్లీ గురించి 58 మిలియన్ల మంది సెర్చ్ చేశారట. ఆసియాలో సెకండ్ హైయెస్ట్ సెర్చింగ్ పర్సన్ గా విరాట్ కోహ్లీ నిలవడం విశేషం. ఇక స్పోర్ట్స్ కోటాలో ఆసియాలోనే మోస్ట్ సెర్చింగ్ పర్సనాలిటీ గా విరాట్ కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నారని వికీపీడియా ప్రకటించింది. వాస్తవానికి ఆసియాలో ఎంతోమంది గొప్ప క్రీడాకారులు ఉన్నప్పటికీ.. వారందరినీ కాదని విరాట్ కోహ్లీ గురించి సెర్చ్ చేయడం నిజంగా గొప్ప విషయమని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. తన ఆట తీరుతో విరాట్ కోహ్లీ చివరికి వికీపీడియాలో కూడా సంచలనం సృష్టిస్తున్నాడని అతని అభిమానులు పేర్కొంటున్నారు.
“విరాట్ కోహ్లీ ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. ఆయన గురించి అనేకమంది శోధిస్తున్నారు. సరికొత్త విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ గురించి విపరీతంగా సెర్చ్ చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుపై 2022 t20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ను పదేపదే చూశారని.. అతడు ఆడిన విధానాన్ని.. అంత వేగంగా పరుగులు చేసిన విధానాన్ని ప్రముఖంగా తెలుసుకున్నారని” వికీపీడియా తన కథనంలో స్పష్టం చేసింది.
Most Popular Asian personalities on Wikipedia:
Mahatma Gandhi – 65M Views.
Virat Kohli – 58M Views. pic.twitter.com/4zHSgRGByD
— Johns. (@CricCrazyJohns) April 10, 2025