Modi vs India Gandhi : భారత్ లో ఉన్న ప్రజాభిప్రాయం ఏంటంటే.. మోస్ట్ పవర్ ఫుల్ ప్రధానులు ఇండియాలో ఎవరంటే? ఇందిరాగాంధీ, మోడీ.. జనరల్ గా టాప్ లో వచ్చేది వీరిద్దరే. దానికి కారణాలు ఉన్నాయి. లోతుగా విశ్లేషిస్తే.. పోలికలు కన్నా తేడాలే ఎక్కువగా కనిపిస్తాయి.
మొట్టమొదటిది అన్నింటికన్నా.. నెహ్రూ కూతురుగా రాజకీయాల్లోకి వచ్చి నాన్న నీడలో ఎదిగింది. మోడీ సెల్ఫ్ మేడ్. తనకు తానుగా ప్రధాని అయ్యారు. ఇందిరగాంధీ వ్యక్తిగత జీవితంపై నెహ్రూ పీఏనే పుస్తకాన్ని రాశాడు. మోడీ విషయంలో పెద్దలు కుదుర్చిన పెళ్లిని త్యాగం చేసి జీవితం దేశానికి అంకితం చేశారు.
పర్ ఫామెన్స్ చూస్తే.. ప్రజాసామ్యాన్ని ఇందిరా నాశనం చేయగా.. మోడీ కాపాడారు. ఇందిర దేశంలో ఎమర్జెన్సీ విధించి వేలాది మందిని ఖైదీలుగా జైల్లో కుక్కి.. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసింది. నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసుకుంటూ వెళ్లింది.
మోడీ బద్ద వ్యతిరేకులు ఉన్న రాష్ట్రాల్లోనూ పాలన సవ్యంగా సాగుతోంది. సొంత పార్టీని అధికారం కోసం నిట్టనిలువునా ఇందిర చీల్చింది. భారతీయ కాంగ్రెస్ ను రెండుగా చీల్చేసిన ఘనత ఇందిరది.. బీజేపీని జాతీయ పార్టీగా మోడీ తీర్చిదిద్దాడు.
కశ్మీర్ లో ఇందిర ఫరూక్ అబ్దుల్లాతో కలిసి రిగ్గింగ్ చేసి గెలిచింది. ఇదే మోడీ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించి ప్రతిపక్షం గెలిచినా సహకరించి కొనసాగిస్తున్నారు.
ఇందిరా గాంధీ మోడీలు అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాన మంత్రులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.