Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి 10 రోజులు అయ్యింది. ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచమే వణికిపోతోంది.ఒక మూడు అంశాలు ఇందులో ప్రధానమైనవి..
అన్నింటికన్నా ముఖ్యమైనది.. అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించడం.. ఎన్నికల హామీల్లోనే పేర్కొన్నాడు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నాడు. మిలటరీ విమానాలను వాడుతున్నాడు. మిలటరీని ఉపయోగిస్తున్నాడు. కాకపోతే వలసదారులను పంపించడం కోసం చేస్తున్న విధానాలు విమర్శల పాలవుతున్నాయి. చేతులకు, కాళ్లకు బేడీలు వేసి పంపించడం వివాదమైంది. 21వ శతాబ్దంలో.. నాగరిక సమాజం తలదించుకునేలా ఉంది.
ఏ దేశాలకు పంపిస్తున్నారో ఆ దేశంతో కలిసి పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లాటిన్ దేశాల తర్వాత భారత్ నుంచే అమెరికాకు అక్రమ వలసలు ఎక్కువగా ఉన్నాయి. భాషను బట్టి ఆ దేశానికి పంపితే పొరపాటు అవుతుంది. గుడ్డిగా పంపితే అక్రమ వలసలు భారత్ కు పెను భారం అవుతుంది.
బలవంతుడిదే రాజ్యం సూత్రాన్ని బరితెగించి అమలు చేస్తున్న ట్రంప్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.