Rahul Gandhi : పార్లమెంట్ లో ఈరోజు జరిగిన ఘటన వినడానికే కష్టంగా ఉంది. ఇంతటి దారుణాతి దారుణంగా పార్లమెంట్ వ్యవహారాలు మారిపోయాయి. పార్లమెంట్ గేట్ దగ్గర జరిగిన రభసలో కేసులు కూడా నమోదయ్యాయి. పార్లమెంట్ అత్యున్నత ప్రజాస్వామిక సభ వీధి అల్లర్ల వేదికగా మారిపోయింది.
ఒకనాడు నిరసన ప్రదర్శనలు చేసుకోవాలనుకుంటే గాంధీ విగ్రహం వద్ద చేసుకునేవారు. అదానీ అంశం పేరుతో గత మూడు వారాలుగా రాహుల్ గాంధీ డైరెక్షన్ లో పార్లమెంట్ మెట్ల మీద నిరసన జరుగుతోంది.
ఈరోజు బీజేపీ కూడా అదే మెట్లపై నిరసన చేస్తోంది. రాహుల్ గాంధీ టీం డైరెక్టుగా వచ్చి వారి మీద పడిపోయారు. సెక్యూరిటీ చెబుతున్నా వినకుండా రాహుల్ మోహరింపచేసి ఎంపీలతో కలిసి దురుసుగా వెళ్లారు. ఒక ఎంపీని తోయడంతో ఆ గొడవలో కేంద్రమంత్రికి గాయాలయ్యాయి. దెబ్బలు తగిలాయి.
బాధ్యత గల ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అయితే అక్కడే భైటాయించి.. నిరసన తెలిపితే మీకు జనాల్లో సానుభూతి వస్తుంది. కానీ తోసేసి లోపలికి వెళ్లడం దారుణం. ఇంకో రెండో వైపు గేటు నుంచి వెళ్లొచ్చు. అయినా రాహుల్ తీరు మాత్రం అన్యాయంగా చెప్పొచ్చు.
అంబేద్కర్ పై మాట్లాడే కొద్దీ కాంగ్రెస్ తన గోతిని తానే తవ్వుకుంటుంది.. ఈ పరిణామాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.