Sankranti sentiment : సెంటిమెంట్స్ మూఢ నమ్మకాలు అయినప్పటికీ జనాలు మాత్రం ఫాలో అవుతారు. సినిమా ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాగా 2025 సంక్రాంతి బరిలో బాలకృష్ణ, రామ్ చరణ్ ఉన్నారు. వీరిని విక్టరీ వెంకటేష్ భయపెడుతున్నాడు. పెద్దగా ఫార్మ్ లో లేని వెంకీ వారిద్దరినీ కలవరానికి గురి చేయడం ఏమిటనే సందేహం రావచ్చు. కారణాలు పరిశీలిస్తే… 2019 సంక్రాంతికి వినయవిధేయరామ, ఎన్టీఆర్: కథానాయకుడు, ఎఫ్ 2 చిత్రాలు విడుదలయ్యాయి.
నందమూరి తారక రామారావు బయోపిక్ కావడంతో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక బోయపాటి శ్రీనుతో ఫస్ట్ టైం రామ్ చరణ్ చేయి కలిపాడు. వినయ విధేయ రామ ప్రోమోలు, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో హైప్ నెలకొంది. వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ఎఫ్ 2 పై ఎలాంటి అంచనాలు లేవు. దర్శకుడు అనిల్ రావిపూడికి అప్పట్లో చెప్పుకోదగ్గ ఫేమ్ లేదు.
భారీ అంచనాల నడుమ విడుదలైన వినయవిధేయ రామ, ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రాలకు ఎఫ్ 2 మూవీ ఝలక్ ఇచ్చింది. బాలయ్య, రామ్ చరణ్ చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. వినయవిధేయరామ మూవీలో కొన్ని సీన్స్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరోవైపు ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ టాక్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 2 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
వెంకటేష్, వరుణ్ ల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఎఫ్ 2 నిలిచింది. కామెడీ బాగా పేలడం మూవీని ఎక్కడికో తీసుకెళ్లింది. కాగా 2025 సంక్రాంతికి కూడా బాలయ్య, రామ్ చరణ్ లతో వెంకీ అమీతుమీ అంటున్నారు. జనవరి 10న గేమ్ ఛేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల కానుంది. ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడి తో వెంకీకి ఇది హ్యాట్రిక్ మూవీ. ఈ క్రమంలో 2019 సీన్ రిపీట్ అయితే.. బాలయ్య, రామ్ చరణ్ లపై రామ్ చరణ్ పై చేయి సాధించవచ్చు. నితిన్ రాబిన్ హుడ్ సైతం సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.