Balochistan : ఒకవైపు భారత్- పాకిస్తాన్ తో పోరాడుతోంది. రెండో వైపు బెలూచీలు పాకిస్తాన్ పై పోరాడుతున్నారు. ఒక వారంలో 71 దాడులు చేశారు. స్వాతంత్ర్య పోరాటానికి తుదిదశకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక దేశం స్వాతంత్ర్యం పొందాలంటే ఏమేం కావాలి. అన్నింటికంటే ఆ దేశ ప్రజల మద్దతు కావాలి.
బెలూచీస్థాన్ లోని ప్రజలు 90 శాతం మంది స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. మద్దతు ఇస్తున్నారు. మేం ప్రత్యేక దేశమే.. మేం పాకిస్తాన్ తో కలిసి ఉండమని భీష్మించుకు కూర్చున్నారు.
బెలూచీలకు పాక్ పై కోపానికి రావడానికి సాంస్కృతిక విభేదాలున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కూడా బెలూచీలకు ప్రత్యేక హోదా ఇచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. బెలూచీలకు ప్రత్యేక దేశం కావాలని పాక్ జాతిపిత జిన్నా వాదించి పోరాడారు. అదే జిన్నా పాకిస్తాన్ స్వాతంత్ర్యం వచ్చాక బెలూచీల ఉద్యమాన్ని అణిచివేసి వారి ప్రాంతాలను వశపరుచుకున్నారు.
ఆరోజు నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బెలూచీలు పోరాడుతున్నారు. ఇందులో ప్రజలు ఏ స్థాయికి వచ్చారంటే అందరు మహిళలు, ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. హింసాత్మకంగా కూడా యుద్ధం చేస్తున్నారు.
భారత్ మద్దతు కోసం ఆశగా బెలూచీల ఎదురుచూపులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
