Bandi Sanjay : బండి సంజయ్ కుమార్.. ఈ బీజేపీ కేంద్రమంత్రి ఎప్పుడు ఏదో వివాదాన్ని రాజేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం కేంద్ర పథకాల పేర్ల అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డుల్లో గద్దర్ కు ఇచ్చేది లేదని .. కేంద్రపథకాల పేర్లు మారిస్తే తెలంగాణకు నిధులు ఇవ్వము అంటూ నోరుపారేసుకున్నారు.
బండి సంజయ్ గద్దర్ గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన గద్దర్ ను కించపరిచేలా విమర్శలు చేసారు. గద్దర్ అనేక సందర్భాలలో తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి. గొప్ప కళాకారుడు.. తెలంగాణ ప్రజాయుద్ధ నౌకగా ఉద్యమాన్ని ముందుండి నడిపారు. బండి సంజయ్ గద్దర్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణసమాజంలో వ్యతిరేకతకు దారితీశాయి.
బండిసంజయ్ వ్యాఖ్యల వల్ల బీజేపీకి ఫేవర్ గా ఉండడం వల్ల ఆ పార్టీ పట్ల సానుభూతి పరులు కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యే ప్రమాదం ఉంది. పవన్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ని ప్రశంసించాడు. అయితే వెంటనే పవన్ పై పడిపోయాడు బండిసంజయ్..
పవన్ కళ్యాణ్ బీజేపీకి ఆప్తమిత్రుడు.. హిందువులు సనాతన ధర్మంగా పరిరక్షించేవ్యక్తిగా పవన్ ను చూస్తున్నారు.. బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలే ఆ పార్టీకి ముప్పు తెచ్చిపెడుతున్నాయి..
గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరైనవేనా? అన్నదానిపై‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.