Homeబిజినెస్Phone Pay : ఫోన్ పే లో స్కాన్ చేసే ముందు ఇలా చేయడం వలన...

Phone Pay : ఫోన్ పే లో స్కాన్ చేసే ముందు ఇలా చేయడం వలన ఎలాంటి మోసాలు జరగవు…

Phone Pay :  ఈ మధ్యకాలంలో భారత దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో నోట్ల రద్దు, కరోనా, లాక్ డౌన్ వంటి పరిణామాల కారణంగా ప్రజలు ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో ఈ మార్పుల వల్ల UPI లావాదేవీలు విస్తృతంగా పెరిగిపోయాయి. మల్టిపుల్ సేవా కేంద్రాలు అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు తదితర వృద్ధి చెందిన సాంకేతికతలు ఈ డిజిటల్ చెల్లింపులకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయితే దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు ఎక్కువ అవుతున్న క్రమంలో పలు రకాల డిజిటల్ పేమెంట్ మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అపరాధులు ఎక్కువగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను చోరీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫిషింగ్ అటాక్ లు చాలా ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి బంగారం లేదా బహుమతులు పేరిట ఫ్రాడ్ లింకుల ద్వారా ముందుగా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటారు. ఇలా తీసుకున్న సమాచారాన్ని దుర్వినియోగం చేసి వారు ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేసి ఆ వ్యక్తి ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును కాజేస్తారు. అలాగే ఓటిపి మోసాలు కూడా ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. అపరాధి యూజర్ చేతిలో ఉన్న ఫోన్ లోని ఓటీపీ కోడ్ ని రిక్వెస్ట్ చేసి అడుగుతారు. ఆ కోడ్ను తమకు అందించిన తర్వాత ఆ యూజర్ ఖాతా నుంచి డబ్బులు మొత్తాన్ని కాజేస్తారు. ఇటీవల ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు ఎక్కువ అవుతుండడంతో ఈ పరిణామం సైబర్ నేరస్తులకు సానుకూలంగా మారింది. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించి అపరాధులు పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ UPI యాప్ లు, నకిలీ QR కోడ్లు స్కాన్ చేసి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు వార్తల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి మోసాలు తగ్గడం లేదు. అందువలన ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపుల ద్వారా లావాదేవీలు చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరు క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి చెల్లింపు చేస్తున్న సమయంలో దాని వివరాలను తప్పకుండా ధ్రువీకరించుకోండి. ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఏదైనా ఒక దుకాణంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాని ద్వారా మీరు పొందిన వివరాలను స్పష్టంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన నకిలీ క్యూఆర్ కోడ్లతో మోసాలు జరగకుండా నివారించుకోవచ్చు. ఇటీవల కాలంలో కొన్ని షాపింగ్ మాల్ లలో అలాగే పెట్రోల్ బంకులలో నక్లీ క్యూఆర్ కోడ్లను ఉపయోగించి మోసాలు జరిగిన కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అన్న అఖిల్ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన కస్టమర్ల బ్యాంకింగ్ సమాచారం లీక్ అయ్యింది. తెలంగాణలో కూడా ఇటువంటి నకిలీ UPI యాప్ లను ఉపయోగించి చెల్లింపులు చేయడం వలన పలు మోసాలు బయటపడ్డాయి.

ఈ విధమైన మోసాలను నివారించడానికి క్యూఆర్ కోడ్లు ఉపయోగిస్తున్న దుకాణాదారులు తమ దుకాణాలలో సౌండ్ బాక్స్ లు ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా సౌండ్ బాక్స్ లో ఉపయోగించడం వల్ల లావాదేవీ వివరాలు సక్రమంగా తెలుస్తాయి. ఈ విధంగా చేయడం వలన మీ చెల్లింపులు సరైనదో కాదో తనిఖీ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో దాని డేటాను ధృవీకరించుకోండి. ఆ దుకాణదారుని పేరు, బ్యాంకింగ్ వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోండి. Google Lens వంటి యాప్లు ఉపయోగించి మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అది సరైనదా కాదా అని తనిఖీ చేసుకోవచ్చు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version