AP Medical Colleges Controversy : ఆంధ్రాలో మెడికల్ కాలేజీలు.. పీపీపీ పద్ధతిపై అనుమతిలివ్వడంపై పెద్ద రగడ జరుగుతోంది. వైసీపీ దీన్ని అందివచ్చిన అవకాశంగా భావిస్తోంది. ఆంధ్రాలో ఎక్కడా లేని పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ చర్చ సాగుతోంది.
వైసీపీ హయాంలో గంగవరం పోర్టు అదానీకి ఇవ్వడంపై పెద్ద రచ్చ జరిగింది. ప్రైవేటు రంగం అంటే అదొక బూతు పదం..విలన్లుగా చిత్రీకరిస్తున్నారు. సమాజాన్ని దోపిడీ చేసే వారిగా చూస్తున్నారు. ఆంధ్రా రాజకీయ రంగం అంతా కూడా నిండి ఉంది. మీడియా, మేధావులు ఇప్పుడు ప్రైవేటు రంగం అంటే దోపిడీ అన్న ఆలోచన ముదిరింది.
21వ శతాబ్దంలో పెట్టుబడులు కావాలంటే ప్రైవేటు రంగం కావాలని చర్చ సాగుతోంది. ప్రభుత్వ రంగంలోని దేన్నీ ప్రైవేటుపరం చేయవద్దని ఆందోళనలు సాగుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీలో ఇదే రచ్చ సాగింది. అది ప్రైవేటుకు పోతుందంటే పెద్ద ఆందోళనలు చేశారు.
పబ్లిక్ ప్రైవేట్ కాదు.. కావాల్సింది ఎప్పటిలోగా అనేదే చర్చ. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణణు కింది వీడియోలో చూడొచ్చు.