Crocodile vs Human: మొసలిని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఇది ప్రజల మధ్య లేకపోయినా ఎప్పుడైనా సరస్సులు, నదుల వద్దకు వెళ్ళినప్పుడు ఇది కనిపిస్తుంది. ఒకసారి ముసలి నోట్లో పడితే బతకడం కష్టమే. అవి మనుషులు అయినా.. జంతువులు అయినా.. ప్రాణాలు పోవాల్సిందే. కానీ మొసలి కి కూడా దయాగుణం ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా? ప్రస్తుత సమాజంలో మనుషుల్లో నమ్మకద్రోహం ఎక్కువగా పెరిగిపోయింది. కానీ మొసలి మాత్రం ఒక్కోసారి అవకాశం వచ్చిన దయాగుణం చూపిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
మొసలి ఏదైనా ఆహారం తీసుకుంటే వెంటనే పిప్పి కావాల్సిందే. ఎందుకంటే దాని పళ్ళు పెద్దవిగా ఉంటాయి. అయితే మనుషుల్లో ఆహారం తీసుకుంటే పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుపోతే క్లీన్ చేసుకోవడానికి ప్రతిరోజు బ్రష్ చేస్తుంటాం. కానీ మొసళ్ళు ఆ పని చేయలేవు. ఎందుకంటే వాటికి చేతులు ఉండవు. అంతేకాకుండా ఇది ఎక్కువగా మాంసాహారం మాత్రమే తింటూ ఉంటుంది. దీంతో ముసలి పళ్ళ మధ్య చాలావరకు ఆహారం ఉండిపోతుంది. అయితే అది రోజుల తరబడి అలాగే ఉంటే పళ్ళు పుచ్చిపోతాయి. దీంతో మరో ఆహారం తీసుకోవడానికి మొసలికి అవకాశం ఉండదు. మరి ఇలాంటి అప్పుడు ఏం చేస్తుంది?
మొసలి పళ్ళ మధ్య ఆహారం ఉండిపోయిందని అనుకున్న సందర్భంలో భూమిపైకి వస్తుంది. అలా భూమి పైకి వచ్చినప్పుడు దాని పెద్ద నోరును తెరుచుకొని ఉంటుంది. అలా నోరు తెరుచుకొని ఉన్న సమయంలో కొన్ని పక్షులు మొసలి నోట్లో వాలి పళ్ళ మధ్య ఉన్న ఆహారాన్ని తీసేస్తాయి. మరికొన్ని పక్షులు తింటూ ఉంటాయి. అయితే మొసలి నోరును పెద్దగా చేసి ఉన్నప్పుడు వాలిన పక్షులను తినడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ తనకు సేవ చేసే వాటిని మొసలి అసలు హాని చేయదు. అంటే తనకు ఉపకారం చేసే వాటికి నమ్మకద్రోహం చేయవు. దీనిని బట్టి తెలిసేది ఏందంటే క్రొకోడైల్ కూడా ధర్మాన్ని పాటిస్తుంది.
కానీ ప్రస్తుత సమాజంలో ఉన్న కొందరు మనుషులు మాత్రం అలా పాటించడం లేదు. ఎవరికైనా సాయం చేస్తే.. వారే తిరిగి వెన్నుపోటు పొడుస్తున్నారు. అంతేకాకుండా డబ్బు లేనప్పుడు ఆదుకున్న వారిని పట్టించుకోక పోవడమే కాకుండా వారిపై తిరిగి దాడి చేసే సంఘటనలు కూడా ఉన్నాయి. ఎవరైనా సాయం చేస్తే వారికి తిరిగి సహాయం చేయకపోయినా పర్వాలేదు. కానీ నమ్మకద్రోహం చేస్తే మాత్రం అత్యంత మహా పాపం అని అంటున్నారు. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మిన తర్వాత అతనికి ద్రోహం చేస్తే ఇక సమాజంలో నమ్మకం అనేదానికి విలువ లేకుండా పోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలి.
అయితే సమాజంలో కొందరు మంచివారు కూడా ఉన్నారు. కానీ వీరిని అమాయకులు అని అంటున్నారు. వాస్తవానికి మంచి కోరుకునే వారు ఎదుటివారికి హాని చేయకుండా ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేసినా వారి జీవితం బాగుంటుంది.