Rahul Gandhi vote chori allegation: రాహుల్ గాంధీ చట్టసభల కన్నా వీధుల్లో బాగా రాణిస్తాడని అనిపిస్తోంది. స్లోగన్స్ ఇవ్వడం.. వీధుల్లో ర్యాలీలు ఇవ్వడం.. పోలీస్ స్టేషన్లకు వెళ్లడం.. పోలీస్ వ్యాన్ల నుంచి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం.. ఇలా ప్రచారం కోసం పాకులాడుతుంటాడు.
మహదేవపురలో ఓట్ల చోరీ అంటూ ఆరునెలల పాటు కష్టపడి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో టీం వివరాలు సేకరించిందట.. ఇది చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా మారింది. దీనికి కౌంటర్ గా బీజేపీ తాజాగా ఆరు నియోజకవర్గాల్లో ఇదే సేకరణ చేపట్టింది. రాయ్ బరేలి (రాహుల్ గాంధీ), వయనాడ్ (ప్రియాంక గాంధీ), కన్నోజు (ములాయం సింగ్ యాదవ్), మయన్మపురి (డింపుల్ యాదవ్), డైమండ్ హార్బర్ (మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ), కొలత్తూరు అసెంబ్లీ (ఎంకే స్టాలిన్) నియోజకవర్గాల్లో బీజేపీ ఈ ఈసీ లెక్కలు తీసింది.
రాహుల్ చెప్పినట్టు ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ దొంగ ఓటర్లు, ఫేక్ ఓటర్లు అడ్రస్ లు, మల్టిపుల్ ఓటర్స్, నకిలీ ఇంటినంబర్లతో ఓట్లు, ఉన్నాయి. మహదేవపురలో ఉన్న ఓట్లు అన్నీ కూడా ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ ఉన్నాయి. ఎన్నికల్లో లోపాలు లేకుండా ఉండవు. బీజేపీ గెలిచినా, కాంగ్రెస్, ప్రతిపక్షాలు గెలిచిన నియోజకవర్గాల్లోనూ లోపాలు ఉన్నాయి.
ఒక వేలు మీరు చూపిస్తే నాలుగు వేళ్ళు మీవైపే చూపిస్తున్నాయి రాహుల్ గాంధీ .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.