Telugu Cinema Trends: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. నిజానికి మంచి కథతో సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం… నాగార్జున లాంటి నటుడు సైతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ అలాగే విలన్ గా కూడా చాలా మంచి పాత్రలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మంచి క్యారెక్టర్ దొరికితే ఏ పాత్రలో అయిన నటించడానికి మన తెలుగు హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పుడు సినిమా మొత్తం యూనివర్సల్ అయిపోయింది. ఏ లాంగ్వేజ్ లో సినిమా వచ్చినా కూడా ఇతర భాషల ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క నటుడు వివిధ భాషల్లో హీరో పాత్ర అయిన పర్లేదు, విలన్ పాత్ర అయినా మాకేం ఇబ్బంది లేదు. ఏదైనా సరే తమకు ఇంపార్టెన్స్ ఉంటే ఆ పాత్రలో నటించి మెప్పించాలానే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఇలాంటి మార్పును చూసి చాలామంది సినిమా జనాలు సైతం అవక్కవుతున్నారు. దర్శకులు సైతం హీరోలకోసం మంచి క్యారెక్టర్స్ రాసుకొని ఆ పాత్రల్లో వాళ్ళను నటింప చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండడం విశేషం…
Also Read: ఎన్టీఆర్ కి ‘వార్ 2’ బిగ్ అలెర్ట్..ఇకపై ఇలాంటి రోల్స్ చేస్తే ఫ్యాన్స్ దూరం అవుతారా?
ఇక ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట రాబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మన తెలుగు హీరోలు ఫుల్ లెంత్ విలనిజాన్ని పండించే క్యారెక్టర్ లో కూడా నటించడానికి సిద్ధపడుతున్నారట… కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా మేము చేస్తాం అంటూ ప్రతి హీరో ముందుకు రావడం విశేషం…
తెలుగు హీరోలైతే ప్రస్తుతం పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ను కొల్లగొడుతున్నారు. కాబట్టి అటు హీరోగా చేస్తూనే, విలనిజాన్ని పండించే పాత్రలను సైతం పోషించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…కానీ కొంతమంది హీరోలు మాత్రం విలన్స్ క్యారెక్టర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు.
Also Read: ప్రభాస్ తో స్పిరిట్…సందీప్ వంగా ప్లాన్ ఏంటి..?
హీరోగా చేస్తూ విలన్ క్యారెక్టర్ లను చేస్తే వాళ్ళ మార్కెట్ కోల్పోతామేమో అనే భయం లో ఉన్నారు. మరి ఎవరికి వాళ్లు కొన్ని స్ట్రాటజీలను వాడుతూ ఇండియాలో ఫేమస్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తన మార్కెట్ ను పెంచుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…