Rahul Gandhi : కుటుంబ పార్టీ నాయకులు రాజ్యాంగాన్ని స్మరించటం గురివిందగింజ సామెత కాదా?

Rahul Gandhi : కుటుంబ పార్టీ నాయకులు రాజ్యాంగాన్ని స్మరించటం గురివిందగింజ సామెత కాదా? కాంగ్రెస్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : June 28, 2024 4:44 pm

Rahul Gandhi : వాగ్ధానాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వాళ్లు ఎవరూ లేరు. అలాగే మాటలు చెప్పడంలో .. ప్రజలను వంచించడంలో నంబర్ 1గా ఉంది. ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదం నుంచి సెక్యూలరిజం దాకా చిత్తశుద్ధి లేని మాటలు కాంగ్రెస్ వి..

ఈ ఎన్నికల్లో స్పెషాలిటీ ఏంటంటే.. ‘రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందని.. మోడీ రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారని.. అమిత్ షా ఫేక్ వీడియోను కాంగ్రెస్ రిలీజ్ చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. వంచించి ఈసారి ఎక్కువ సీట్లను గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజుకు కూడా దానిమీద కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.సాక్షాత్తూ కాంగ్రెస్ సీఎంనే ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది.

ఈ స్లోగన్ ఓట్లు గుంజుకోవడానికి తప్పితే చిత్త శుద్ధి కాంగ్రెస్ కు లేదు అనడంలో సందేహం లేదు. రాజ్యాంగాన్ని చూపిస్తున్న రాహుల్ గాంధీ ఒక్కసారైనా దాన్ని చదివి ఉంటాడా? అన్న అనుమానాలు ఉన్నాయి.

కుటుంబ పార్టీ నాయకులు రాజ్యాంగాన్ని స్మరించటం గురివిందగింజ సామెత కాదా? కాంగ్రెస్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.