Mahesh Babu: అది మహేష్ రేంజ్ అంటే..టీ షర్ట్ సింపులే కానీ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాంక్

రీసెంట్ గా వెకేషన్ నుంచి మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో గివెన్చీ క్రెస్ట్ టీ షర్టు ధరించారు మహేష్ బాబు. చాలా సింపుల్ గా కనిపిస్తన్న స్టార్ ను చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

Written By: Swathi, Updated On : June 28, 2024 2:59 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అవసరం లేదు. క్రేజీ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లు, ఎమోషనల్ స్టోరీలు, కతర్నాక్ ఫైట్ లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రేంజ్ లో ఉంటుంది మహేష్ బాబు చిట్టా. ఎన్నో సినిమాలు హిట్లు, కొన్ని మాత్రమే ఫ్లాప్ లు ఉన్న ఈ హీరో ఎక్కడ కనిపించినా కూడా సింపుల్ గా కనిపిస్తారు. ఈయన వయసు 48 సంవత్సరాలు కానీ మహేష్ బాబు ధరించే టీ షర్టుల వల్ల చాలా యంగ్ హీరో మాదిరి కనిపిస్తాడు అంటారు ఆయన అభిమానులు.

రీసెంట్ గా వెకేషన్ నుంచి మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో గివెన్చీ క్రెస్ట్ టీ షర్టు ధరించారు మహేష్ బాబు. చాలా సింపుల్ గా కనిపిస్తన్న స్టార్ ను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు కొందరు. ది సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ ఇన్ స్టా పేజీ ప్రకారం ఈ టీ షర్ట్ ధర రూ.63,000 అని తెలుస్తోంది. వామ్మో సింపుల్ గా కనిపించే ఈ షర్టుకు ఈ రేంజ్ లో ధర ఉంటుందా అని నోరు వెళ్లబెడుతున్నారు.

గతంలోనూ మహేష్ యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిథిగా వెళ్లారు. ఆ సమయంలో సింపుల్ టీషర్ట్ ధరించి ఈవెంట్లో హైలెట్ అయిన సంగతి తెలిసిందే..అందులో సింపుల్ గా కనిపించినా ఆ నెక్ టీ షర్ట్ ధర రూ.47,000. ఇక ఇప్పుడు మహేష్ ధరించిన మరో టీషర్ట్ ధర రూ.63,000 అని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం రెండు టీ షర్టులు లక్షకు పైగా ఖరీదు చేస్తాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈయన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి రెగ్యూలర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట మేకర్స్. మహేష్ సరసన అలియా భట్ కథానాయికగా నటించనుందట.