https://oktelugu.com/

Pawan Kalyan : దాతృత్వంలో దాన కర్ణుడిని మించిన మానవతా వాది

దాతృత్వంలో దాన కర్ణుడిని మించిన మానవతా వాది పవన్ కళ్యాణ్. ఆయన సేవా తత్పరతపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2024 / 04:54 PM IST

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా జనాన్ని ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15వ తేదీ ప్రతీ పంచాయితీకి 10వేలు, 25వేలు ఇచ్చి మొట్టమొదటి సారి దేశభక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 13వేల పైచిలుకు గ్రామాల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి గ్రామ సభల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పిన వ్యక్తి పవన్.

    ప్రభుత్వం తీసుకున్న దేవాలయాల్లో హిందువుల నియామకాలు మాత్రమే ఉండేలా పవన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. వరద బాధితుల విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్పందన జనం అవాక్కైపోయారు.

    ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెరో కోటి రూపాయలు.. తాను నిర్వహించే శాఖలో వరదకు ఎఫెక్ట్ అయిన పంచాయితీలకు మొత్తం 4 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. మిగతా సినిమా హీరోలతో పోలిస్తే ఆయన దగ్గర దాచుకున్న రూపాయలు తక్కువ. అయినా ఇంత పెద్ద సాయం చేయడం ప్రశంసనీయం..

    దాతృత్వానికి డబ్బు ఉంటే చాలదు.. పెద్ద మనసు ఉండాలి. వరద వచ్చినప్పుడు ఆయన బయటకు రాలేదు అన్నది ప్రధాన ఆరోపణ. పుట్టినరోజున కూడా పర్యవేక్షణలో ఉన్నాడంటే ఆయన నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.

    దాతృత్వంలో దాన కర్ణుడిని మించిన మానవతా వాది పవన్ కళ్యాణ్. ఆయన సేవా తత్పరతపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.