Brazil: ట్విట్టర్.. సోషల్ మీడియా యాప్‌లలో అతిపెద్ద ప్లాట్‌ఫాంగా ఎదిగింది. వ్యాపారులు, రాజకీయ నాయకులు వివిధ దేశాల అధినేతలు, ప్రధానులు కూడా ట్విట్టర్ వినియోగించేవారు. దీంతో ట్విట్టర్‌కు భారీగా ఆదరణ పెరిగింది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కన్ను ట్విట్టర్‌పై పడింది. గతంలో ట్విట్టర్‌లో భాగస్వామిగా మాత్రమే ఉన్న మస్క్.. తర్వాత దానిని మొత్తం ఆక్రమించేశాడు. దానిని పూర్తిగా కొనుగోలు చేశాడు. కొంతకాలం ట్విట్టర్ పేరుతోనే నడిపించాడు. కానీ, ఉద్యోగులను మార్చేశాడు. ఈ క్రమంలో ట్విట్టర్ అనేది లేకుండా చేసేందుకు క్రమంగా మార్పులు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మొదట ట్విటర్ సింబల్‌గా ఉన్న బుల్లి పిట్ట లోగోను తొలగించాడు దాని స్థానంలో ఇంగ్లిష్ ఎక్స్ అక్షరం తెచ్చాడు. తర్వాత ట్విట్టర్ పేరు కూడా తీసేసి ఎక్స్‌గా మార్చాడు. ఇక ట్విట్టర్‌లో బ్లూటిక్స్ విషయంలో బిజినెస్ చేయాలనుకున్నాడు. అయితే వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఏడాదిగా ఎలాంటి మార్పులు చేర్పులు చేయడం లేదు. అయితే.. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను నిషేధించే దేశాలు పెరుగుతున్నాయి.
చైనాలో బ్యాన్..
ఎక్స్‌పై చైనాలో ఎప్పటి నుంచో నిషేధం ఉంది. అమెరికా సంస్థ కావడంతో చైనా దానిని నిషేధించి.. తమ దేశస్తుల కోసం ప్రత్యేక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వినియోగిస్తోంది.
రష్యా కూడా..
యూరిపోయన్ దేశం రష్యా కూడా ఎక్స్‌ను నిసేధించింది. ఇందుకు కూడా కారణం అది అమెరికా సంస్థ కావడమే. అమెరికా, రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆధిపత్య పోరాం జరుగుతోంది. ఈ క్రమంలో అమెరికా సంస్థ అయిన ఎక్స్‌పై నిషేధం విధించింది.
నార్త్ కొరియా..
ఇక అమెరికా మరో శత్రుదేశం నార్త్ కొరియా. ఆ దేశంలో నియంత పాలన సాగుతుంది. అక్కడ సోషల్ మీడియా వినియోగమే తక్కువ. అలాంటి దేశంలో అమెరికా సంస్థలకు చెందిన ఎలాంటి ఉత్పత్తులు దొరకవు. వినియోగించరు. ఎక్స్ కూడా ఆ జాబితాలో చేరింది.
ఇరాన్, తుర్కెమిస్థాన్, ఉజ్బెకిస్థాన్, మయన్మార్
ఇక ముస్లిం దేశాలు అయిన ఇరాన్, తుర్కెమిస్థాన్, ఉజ్బెకిస్థాన్, మయన్మార్‌లో కూడా సోషల్ మీడియాపై నిషేధం ఉంది. ఈ క్రమంలో ఎక్స్‌ను కూడా ఆయా దేశాలు నిషేధించాయి.
తాజాగా షాక్ ఇచ్చిన బ్రెజిల్..
తాజాగా అమెరికా వ్యాపారవేత్త, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ కు బ్రెజిల్ సుప్రీంకోర్టు షాకిచ్చింది. బ్రెజిల్‌లో ఎక్స్ పై నిషేధం విధించింది. స్థానికంగా తమ దేశంలో ఓ ప్రతినిధిని నియమించేందుకు మస్క్ నిరాకరించడంతో ఈ ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. నిషేధపు ఉత్తర్వులను అతిక్రమించి వీపీఎన్ ద్వారా ఎక్స్ ను ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని కోర్టు పదే పదే హెచ్చరించింది. దాదాపు 40 మిలియన్ల జనాభా ఉన్న బ్రెజిల్ లో 80 లక్షల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారు. నెలకు ఒకసారైనా ఎక్స్‌లో పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం చేస్తుంటారని ఓ సర్వే వెల్లడించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More