Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 లో కొంతమంది కంటెస్టెంట్స్ పై ప్రారంభ ఎపిసోడ్ నుండే విపరీతమైన ట్రోల్ల్స్ మొదలయ్యాయి. అలాంటి కంటెస్టెంట్స్ లో ఒకరు నాగ మణికంఠ. ఈ కంటెస్టెంట్ సానుభూతి కోసం ఎదో ప్రయత్నాలు చేస్తూ నెటిజెన్స్ వైపు నుండి తీవ్రమైన ట్రోల్ల్స్ ఎదురుకుంటున్నాడు. చూసేందుకు సున్నిత మనస్కుడిగా అనిపిస్తున్న మణికంఠ బయటకి వచ్చిన తర్వాత ఈ ట్రోల్ల్స్ ని చూసి ఏమి చేసుకుంటాడో అని కొంతమంది విశ్లేషకులు భయపడుతున్నారు. బిగ్ బాస్ ఎపిసోడ్ లోకి ఒక కంటెస్టెంట్ ని ఎంచుకునే ముందు రకరకాల పరీక్షలు చేస్తుంటారు, వాటిని విజయవంతంగా అధిగమిస్తేనే బిగ్ బాస్ లో మనుగడ సాగించగలరు. కానీ మణికంఠ ఎమోషనల్ గా బాగా వీక్ అని ఆయనే నిన్నటి ఎపిసోడ్ లో చెప్పుకున్నాడు.
ఎమోషనల్ గా వీక్ అయిన ఒక కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లోకి టీం ఎలా తీసుకొచ్చారో అర్థం కావడం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతీ రోజు వత్తిడితో కూడుకొని ఉంటుంది, నాగ మణికంఠ బయట ఏమి జరుగుతుందో భయపడి ఏడ్చేస్తున్నాడు. అతనికి నిఖిల్ , యష్మీ వంటి కంటెస్టెంట్స్ సర్దిచెప్పి మాములు మనిషిగా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ వల్ల అవ్వడం లేదు. ఇతని ఏడుపుని చూసి ‘ఆమ్మో..నీకు దండం పెడుతా, నువ్వు ఏడవకు రా బాబు, చూడలేక చస్తున్నాం’ అంటూ అతని పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇతని బుర్రలో ఉన్న నెగటివ్ ఎనర్జీ కంటెస్టెంట్స్ అందరికీ పాస్ అవుతూ సరిగా గేమ్ ని ఆడలేకపోతుండడం గమనార్హం. పల్లవి ప్రశాంత్ ఫార్ములా ని నాగ మణికంఠ చాలా పక్కాగా అనుసరిస్తున్నాడు. అతను కూడా ప్రారంభంలో సానుభూతి కోసం చాలా ప్రయత్నాలు చేసారు. అవి జనాలకు చాలా తేలికగా అర్థమై పల్లవి ప్రశాంత్ ని దారుణంగా ట్రోల్ చేసేవారు. నాగ మణికంఠ మీద కూడా ప్రస్తుతం అలాంటి ట్రోల్ల్స్ నడుస్తున్నాయి. కానీ పల్లవి ప్రశాంత్ రెండవ వారం నుండే గేమ్స్ తో తన విశ్వరూపం చూపించేసాడు.
వామ్మో వీడిని ఒలంపిక్స్ కి పంపేయొచ్చు, అదేమీ కసి, అదేమీ ఆట రా బాబు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేత అనిపించే రేంజ్ లో ఆడాడు. మరి నాగ మణికంఠ ఆ స్థాయిలో గేమ్స్ ఆడగలడా?, పల్లవి ప్రశాంత్ సానుభూతి గేమ్స్ ఆడినప్పటికీ కూడా మనిషి మనస్తత్వం చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ప్రతీ దానికి ఏడవడం పల్లవి ప్రశాంత్ కి చేతకాదు, కానీ ఇక్కడ నాగమణికంఠ ప్రతీ సందర్భాన్ని సెంటిమెంటల్ కోణంలో జనాల్లోకి వెళ్లాలని చూస్తున్నాడు. ఇది చూసేందుకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఈ వారం ఇతనికి నాగార్జున కోటింగ్ ఇచ్చి మంచి దారిలో పెడుతాడా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మణికంఠ టాప్ 2 స్థానంలో కొనసాగుతున్నాడు. అంటే ఇతను ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.