POK turns battlefield: పాకిస్తాన్ అస్తిత్వం ప్రమాదంలో పడినట్టుగా నిన్న మొన్న ఘటనలు రుజువు చేస్తున్నాయి.. ఎప్పటి నుంచో అనుకున్నదే పాక్ లో జరుగుతోంది. బెలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వాలోనే కాదు.. ఆక్రమిత కశ్మీర్ లో ఎప్పుడూ జరగనటువంటి నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంత ఉధృతంగా ఈ పోరాటాలు సాగుతున్నాయి. అక్లోబర్ 1వ తేదీన ముజఫరబాద్ ను ముట్టడించాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఒక పిలుపు వచ్చింది. అది ఉధృతంగా మారింది. హింసాత్మకంగా మారింది.
బీర్కూట్, ముజఫరాబాద్ లో 5, దద్యాల్ లో ఇద్దరు చనిపోయారు. దాదాపు 12 మంది మరణించారు. ముగ్గురు స్థానిక పోలీసులు కూడా ఇందులో చనిపోయారు. పీవోకే పోలీసులను పంజాబ్ పోలీసులు చంపారన్నది నిరసనకారుల వాదన..
ఆందోళనకారులపై కాల్పులు జరపమని స్థానిక పోలీసులను ఆదేశిస్తే వారు ధిక్కరించారట.. దీంతో పంజాబ్ రేంజ్ పోలీసులు ఈ పీవోకే పోలీసులపై కాల్పులు జరిపి చంపేశారట.. వందల మంది గాయపడ్డారట..
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో స్థానిక పోలీసుల్ని కాల్చి చంపిన పాకిస్తాన్ పోలీసులు.. అక్కడి పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.