OG vs Kantara Chapter 1 Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం విడుదలై 8 రోజులు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద జోరు మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. దసరా పండుగకు ముందు సినిమాలు చాలా వీక్ గా ఉంటాయి అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. కానీ ఈ చిత్రం ఆ సీజన్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ పవర్ స్టార్ సత్తా ఎలాంటిదో అందరికీ మరోసారి రుచి చూపించింది. నిన్న ‘కాంతారా : చాప్టర్ 1’ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించిన సినిమా తో పోటీ కాబట్టి, ఓజీ చిత్రం పాతది అయిపోవడం తో, ఆడియన్స్ మొదటి ఛాయస్ ఇక కాంతారా చిత్రమే అవుతాడని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక B,C సెంటర్స్ లో ఓజీ చిత్రానికి టికెట్స్ దొరకడం చాలా కష్టమైంది. ఓజీ చిత్రానికి టికెట్స్ దొరకని వాళ్ళు కాంతారా కి వెళ్లారు. దీనిని బట్టి ఓజీ ప్రభంజనం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉగాది రోజున ఈ చిత్రం ప్రాంతాలవారీగా రాబట్టిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ఒక్క సీడెడ్ ప్రాంతం లోనే ఈ చిత్రానికి 8వ రోజున కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కడప, తిరుపతి వంటి సెంటర్స్ లో మంచి థియేటర్స్ మొత్తం కాంతారా చిత్రానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ సినిమాకు ఇంత రేంజ్ వసూళ్లు రావడం సాధారణమైన విషయం కాదు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి 90 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. గుంటూరు జిల్లా నుండి 44 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 36 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 32 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 24 లక్షల రూపాయిలు,కృష్ణ జిల్లా నుండి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇదంతా రిటర్న్ జీఎస్టీ తో కలిపిన వసూళ్లుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అలా కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి 8వ రోజున 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలంగాణ ప్రాంతం నుండి కోటి 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రం 8 వ రోజున 5 కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. మంచి క్రేజ్ ఉన్న కొత్త సినిమా విడుదలైనప్పటికీ కూడా ఓజీ చిత్రం ఆ సినిమాతో సరిసమానంగా నిలబడి ఇంతటి భారీ వసూళ్లు రాబట్టిందంటే పవర్ స్టార్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.