కేరళలోని ఒక చర్చి నిర్వహిస్తున్న స్కూలులో ముస్లిం విద్యార్థినిపై హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. స్కూలు నియమావళి ప్రకారం యూనిఫాం తప్ప ఇతర దుస్తులు లేదా తల కప్పుకునే వస్త్రాలు ధరించరాదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మత స్వేచ్ఛ తమ మౌలిక హక్కు అని వాదిస్తున్నారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మత స్వేచ్ఛ, విద్యాసంస్థల నియమాలు ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఎలా ఉండాలి అన్న ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. విద్యా శాఖ ఈ విషయంపై నివేదిక కోరగా, పోలీసులు పరిస్థితిని గమనిస్తున్నారు.
హిజాబ్‌పై ఇలాంటి వివాదం కేరళలో ఇదే మొదటిసారి కాదు. అయితే చర్చి నిర్వహించే విద్యాసంస్థలో జరగడం వల్ల ఈసారి వివాదం మరింత సున్నితంగా మారింది.
కేరళ చర్చి స్కూలులో ముస్లిం విద్యార్థిని హిజాబ్ వివాదం పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.