Bengaluru Crime: ప్రాణాలు పోసే వారిని వైద్యులు అంటారు. అదే ప్రాణాలు తీసేవారిని రాక్షసులు అంటారు. వీడు వైద్యుడి రూపం ఎత్తిన రాక్షసుడు. జాలి, దయ, కరుణ లేని మూర్ఖుడు. ఇటువంటివాడు రోగులను ఇంకా ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాడో.. చివరికి వీడి పాపం పండింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆ అమ్మాయి పేరు కృతిక రెడ్డి. పేరుకు తగ్గట్టుగానే కుందనపు బొమ్మలాగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా స్థితి మంతులు కావడంతో ఆమెను ఉన్నత చదువులు చదివించారు. ఏకంగా వైద్యురాలిని చేశారు. ఆమె చర్మవ్యాధుల నివారణ నిపుణురాలుగా పేరుపొందారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విక్టోరియా ఆసుపత్రిలో డెర్మటాలజిస్ట్ గా పని చేస్తున్నారు. కృతిక కు 2024 మే 26న కర్ణాటకకే చెందిన మహేందర్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్.. వివాహం జరిగిన తర్వాత కృతికలో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆమెకు అంతకుముందే అజీర్ణం, గ్యాస్ట్రిక్, లో షుగర్ సమస్యలు ఉన్నాయి. వీటిని గుర్తించిన మహేందర్ రెడ్డి భార్యను ఏమీ అనకుండానే అత్తగారింటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆమెకు చికిత్స పేరుతో మత్తుమందు ఇవ్వడం మొదలుపెట్టాడు. మత్తుమందు ఇచ్చిన ప్రతిసారి డోస్ పెంచేవాడు. అలా డోర్స్ తట్టుకోలేక ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 23న ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది.
స్పృహ తప్పి పడిపోయిన కృత్తికను మహేందర్ రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేసిన అనంతరం వైద్యులు ఒకసారిగా షాక్ అయ్యారు. ఆమె శరీరంలో మత్తుమందు ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. చివరికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా పరీక్షలు నిర్వహించారు. అందులో కూడా అదే ఫలితం వచ్చింది. దీంతో బెంగళూరు పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మత్తుమందు అధికంగా ఇవ్వడం ద్వారానే తన భార్యను చంపేసినట్టు మహేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.. వాస్తవానికి కృతికలో అనారోగ్య సమస్యలను దాచిపెట్టిన నేపథ్యంలో తాను ఈ కోల్డ్ బ్లడ్ నేరానికి పాల్పడినట్టు మహేందర్రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది.