https://oktelugu.com/

Madhavi Latha : మాధవీలత బాణాన్ని నిజంగానే మసీదుపై ఎక్కుపెట్టిందా?

మాధవీలత బాణాన్ని నిజంగానే మసీదుపై ఎక్కుపెట్టిందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2024 / 04:42 PM IST

    Madhavi Latha : సోషల్ మీడియా, మీడియాలో మాధవీలత మీద విపరీతమైన కథనాలు వస్తున్నాయి. సెన్షేషనల్ వార్తలు ప్రచురిస్తున్నాయి. శ్రీరామ నవమికి బాణం ఎక్కుపెట్టిందని ఆమెను మతవాదిగా ముద్రిస్తున్నారు. మాధవీలత ఒక క్లాసికల్ డ్యాన్సర్. ఆమె బాణం ఎక్కుపెడితే మసీదు మీద ఎక్కుపెట్టిందని వివాదం రాజేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు..

    ఈ ఆరోపణలు చేసింది ఓవైసీ కాదు.. మీడియానే ఇలా విష ప్రచారం చేయడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. మాధవీలత ముస్లింలపై ఏనాడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. హిందూయిజంపై మాత్రమే మాట్లాడుతూ భక్తి ప్రవత్తులతో జీవిస్తోంది.

    ఇప్పుడు మతాన్ని రెచ్చగొట్టి మాధవీలతను విలన్ ను చేసి ఓవైసీ సెక్యూలరీ వాదిగా ఎలా చెప్పుకుంటారని అందరూ ప్రశ్నిస్తున్నారు. ముస్లిం సమాజంలోని అణగారిన వర్గాల కోసం మాధవీలత పోరాడుతోంది. వారికి ఆర్థిక సాయం చేస్తోంది. ఆవిడను ముస్లింలకు వ్యతిరేకంగా ఓవైసీ ఫోకస్ చేస్తున్నారు. మాధవీలత ముస్లింలకు వ్యతిరేకమని ఓవైసీ ప్రచారం చేస్తున్నారు.

    మాధవీలత బాణాన్ని నిజంగానే మసీదుపై ఎక్కుపెట్టిందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.