https://oktelugu.com/

Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ దీప్తి సునైనా… ధర ఎంతో తెలుసా?

షణ్ముఖ్ - దీప్తి సునైనా ప్రేమించుకున్నారు. చాలా కాలం రిలేషన్ లో ఉన్నారు. షణ్ముఖ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన అనంతరం దీప్తి అతనికి బ్రేకప్ చెప్పింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 23, 2024 / 04:39 PM IST

    Bigg Boss Deepthi Sunaina bought a luxury car

    Follow us on

    Deepthi Sunaina: యూట్యూబ్, టిక్ టాక్ లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది దీప్తి సునైనా. తన అందం, క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ షోతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. అనంతరం యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ క్రేజ్ రాబట్టింది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన డాన్స్ వీడియోలు అపట్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.

    షణ్ముఖ్ – దీప్తి సునైనా ప్రేమించుకున్నారు. చాలా కాలం రిలేషన్ లో ఉన్నారు. షణ్ముఖ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన అనంతరం దీప్తి అతనికి బ్రేకప్ చెప్పింది. హౌస్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్ లేడీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో చాలా సన్నిహితంగా ఉండటం నచ్చని దీప్తి ఈ నిర్ణయం తీసుకుందనే వాదన ఉంది. బ్రేకప్ తర్వాత ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా మారిపోయారు. ప్రస్తుతం దీప్తి పూర్తి ఫోకస్ కెరీర్ పైన పెట్టింది. దీప్తి సునైన కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్లు చేస్తుంది.

    కాగా దీప్తి సునైనా లగ్జరీ కారు సొంతం చేసుకుంది. ఆమె టయోటా హైలెక్స్ అనే కారు కొనుగోలు చేసింది. ఇందులో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు పాసెంజర్స్ కూర్చునే అవకాశం ఉంది. వెనుక లగేజ్ స్పేస్ ఉంటుంది. ఇక మార్కెట్ లో ఈ కారు ధర రూ. 30 నుంచి 37 లక్షల వరకు ఉంది. కొత్త కారు పక్కనే నిల్చొని ఫోజులిచ్చింది. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    దీప్తి కారు కొనుగోలు చేసిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్యూట్ అండ్ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. యూత్ లో ఆమెకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీప్తికి ఇన్స్టాగ్రామ్ లో 42 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.