https://oktelugu.com/

Kerala CPM: రోజు రోజుకీ అప్రతిష్ట పాలవుతున్న కేరళ సీపీఎం

కన్నూర్ లాబీలో విజయన్ తోపాటు జయరాజన్, పీ.జనరాజన్ లాంటి వ్యక్తులు ముఖ్యలు ఉన్నారు. విజయన్ కు ఎంతో దగ్గరైన ఈపీ జయరాజన్ ను తీసేయడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు తొలగించారన్నది ఇప్పుడు సమస్యగా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 3, 2024 / 12:53 PM IST

    కేరళ సీపీఎం రోజురోజుకు అప్రతిష్ట పాలవుతోంది. రెండు రోజుల క్రితం వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ ను సడెన్ గా తీసేశారు. వేరే అతడిని పెట్టారు. మొదటి ప్రభుత్వంలో నంబర్ 2గా ఈపీ జయరాజన్ ఉండేవారు. కన్నూర్ లాబీలో ముఖ్యమైన వ్యక్తి. సీపీఎం ను మొత్తం కంట్రోల్ చేసేది కన్నూర్ లాబీనే.. అక్కడే సీపీఎం , ఆర్ఎస్ఎస్ నేతల కొట్లాటతో హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

    కన్నూర్ లాబీలో విజయన్ తోపాటు జయరాజన్, పీ.జనరాజన్ లాంటి వ్యక్తులు ముఖ్యలు ఉన్నారు. విజయన్ కు ఎంతో దగ్గరైన ఈపీ జయరాజన్ ను తీసేయడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు తొలగించారన్నది ఇప్పుడు సమస్యగా మారింది.

    మొదటి నుంచి వివాదాస్పద నేతగా ఈపీ జయరాజన్ పేరొందాడు. రైతు సంఘం మీటింగ్ కు ఒక విలాసవంతమైన కారులో వచ్చాడు. అదో పెద్ద వివాదమైంది. 2007లో ఇంకో వివాదంలో చిక్కుకున్నాడు. లాటరీ కింగ్ వద్ద 2 కోట్ల విరాళం తీసుకొని ఈపీ జయరాజన్ చిక్కుల్లో పడ్డారు.

    రోజు రోజుకీ అప్రతిష్ట పాలవుతున్న కేరళ సీపీఎం తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.