Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన విజయాలు తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా భారతదేశం అంతటా ఆయన పేరుకి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. నిజానికి ఈయన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా భారీ రేంజ్ లో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. వీళ్లిద్దరి తర్వాత రామ్ చరణ్ లాంటి నటుడు ఇండస్ట్రీకి పరిచయమై చిరంజీవి కొడుకు గానే కాకుండా స్టార్ హీరోగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలను చేశాడు. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్లు ఉంటే కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మరి కొన్ని డిజాస్టర్స్ కూడా ఉండడం విశేషము. ఇక ఏది ఏమైనప్పటికి ఆయన చేసిన సినిమాల్లో మంచి నటనను కనబర్చి సినిమాలను విజయ తీరాలకు చేర్చడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక తొందర్లోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమా కోసం కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే రామ్ చరణ్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన ఒక రెండు సినిమాలంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదట. అందులో ఒకటి బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ కి రీమేక్ అయిన జంజీర్ సినిమా కాగా, మరొకటి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ సినిమా… ఈ రెండు సినిమాలు రామ్ చరణ్ కు బ్యాడ్ నేమ్ తీసుకురావడమే కాకుండా ఆయన క్రేజ్ ని కూడా చాలా వరకు తగ్గించాయి. దానివల్ల ఈ సినిమాల పట్ల ఆయనకు పెద్దగా ఆసక్తి అయితే లేదట. ఇక ఈ రెండు సినిమాలను చేయకుండా ఉంటే బాగుండేది అంటూ ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ మాట్లాడటం విశేషం…
ప్రస్తుతం ఆయన చేయబోయే సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ మరోసారి స్టార్ హీరోగా గుర్తింపుని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఆయన ఇక మీదట పాన్ వరల్డ్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి…చూడాలి మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు అనేది…