West Bengal Elections : ఇటీవల ఒక ఇండిపెండెంట్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ‘శశిథరూర్’ సీఎం క్యాండిడేట్ గా కావాలని జనాల కోరుకున్నట్టు తేలింది. అదే సంస్థ 2023 జూన్ లో వినూత్నమైన సర్వే చేసింది. పశ్చిమ బెంగాల్ లో జనాలు ఏమనుకుంటున్నారన్న దానిపై సర్వే చేశారు. ఆ వివరాలు చూస్తే..
ప్రభుత్వ వ్యతిరేకత పశ్చిమ బెంగాల్ లో 60 శాతం ఉందని తేలింది. తర్వాత పెద్ద ఎత్తున అవినీతి ప్రభుత్వం చేస్తోందని 60 శాతం మంది ప్రజలు చెప్పారు. ప్రభుత్వ క్రెడిబిలిటీ తగ్గింది. కోల్ కతా లా కాలేజీలో సెక్స్ కుంభకోణం కూడా ప్రజల్లో వ్యతిరేకతను ప్రభుత్వంపై తెచ్చిపెట్టింది.
క్రెడిబిలిటీ ప్రభుత్వంపై పూర్తిగా పోయిందని బెంగాల్ లో 66 శాతం మంది చెప్పుకొచ్చారు. మీరు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటని అడిగితే.. అవినీతి బాగా ఉందని రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు చెప్పుకొచ్చారు.
రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తీరు ఎలా ఉండబోతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.