DMK : పవన్ కళ్యాణ్ భాషా వివాదంపై మాట్లాడిన తీరు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. దురదృష్టం ఏంటంటే.. తెలుగు మీడియాలో డీఎంకే విమర్శలనే ఫోకస్ చేశారు. ట్విట్టర్, ఫేస్ బు క్ లో పవన్ వ్యాఖ్యలపై ప్రశంసలు కురిశాయి.
పవన్ వ్యాఖ్యలపై లబ్ధిపొందాలని డీఎంకే ఎంపీలు, నేతలు కామెంట్ చేశారు. పవన్ పాత మాటలు, కొత్త మాటలను వైరల్ చేశారు. అయితే దీని వల్ల డీఎంకేకే మైనస్ అయ్యింది.
అన్నామలై కూడా త్రిభాష విధానంపై త్రి లాంగ్వేజ్ ఫార్ములాపై సంతకాల సేకరణ చేశారు. దానికి తమిళనాట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అందరూ హిందీని స్వాగతిస్తున్నారు. డీఎంకే దీనికి ఇరుకనపడ్డారు.
డీఎంకేకు హిందీ ప్రాధాన్యత అర్థమైంది కాబట్టి డీలిమిటేషన్ మీద పడ్డారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు.
తమిళనాడులోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో తమిళం, ఇంగ్లీష్ చెబుతారు. తమిళ స్కూళ్లలో తమిళ భాష మాధ్యమంలో 65 లక్షల నుంచి 44 లక్షలకు విద్యార్థులు పడిపోయారు. 2018లో 55 లక్షలు ఉన్న ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ సంవత్సరానికి 84 లక్షలకు పెరిగారు.
భాషా వివాదంలో దేశ వ్యాప్తంగా ఒంటరయిన డీఎంకే తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.