Modi stand for country : మోడీ దౌత్య నీతిపై ప్రతిపక్షాల అవహేళనలు చేస్తున్నారు. ట్రంప్ ను వాటేసుకున్నాడు.. కౌగిలించుకున్నాడు. ఇండియాకు తీసుకొచ్చి సన్మానం చేశాడు. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు. మరి ఇవన్నీ ట్రంప్ విషయంలో చేస్తే.. మోడీకి ట్రంప్ నుంచి మంచి శాస్తి జరిగిందని ప్రతిపక్ష నేతల చేస్తున్నారు. వాళ్లు చెప్పిన వరకూ నిజం. ఇది నిజమే..
కానీ ట్రంప్ తోనే కాదు.. అమెరికాలోని అన్ని పార్టీల నేతలతోనూ మోడీ ఇలానే ప్రవర్తిస్తాడు. బ్రిటన్ ప్రధానితోనూ, కెనడా ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధానితోనూ అంతే స్నేహంగా మోడీ మెలుగుతాడు.
ఒబామాతో, బైడెన్ తోనూ మోడీ స్నేహం ఒకేలా ఉంటుంది. మోడీ దౌత్యనీతిలో ప్రధాన అంశం ‘వ్యక్తిగత సంబంధాలు’.. ఇది కొన్ని సార్లు ఉపయోగపడుతాయి.. మరికొన్ని సార్లు ఉపయోగపడవు.
ఖతార్ లో భారతీయులకు ఉరిశిక్ష పడితే ఆ దేశాన్ని ఒప్పించి విముక్తి చేసిన ఘనత మోడీ. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధంలో ఒకరోజు యుద్ధం ఆపించి భారతీయులను ఆ దేశం నుంచి తీసుకొచ్చిన ఘనత మోడీది. మోడీ వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడ్డాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి ఆయన ఇంటికి పిలవకుండానే వెళ్లాడు. పాక్ దాడి చేస్తే యుద్ధం చేస్తున్నాడు. కఠినంగా వ్యవహరిస్తున్నాడు.
జీ జిన్ పింగ్ భారత్ వచ్చాడు. చైనాకు మోడీ వెళ్లాడు. కానీ చైనా సైనికులు మనపై దాడి చేస్తే మోడీ రాజీపడలేదు. దేశ ప్రజలను ఎక్కడ తాకట్టు పెట్టడం లేదు.
మోడీ దేశం కోసం నిలబడ్డాడా.. రాజీపడ్డాడా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.