BJP vs Congress : లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. సీట్ల గురించే అంతా మాట్లాడుతున్నపారు. ఇది తాత్కాలికమైనది.. సీట్లు రావడానికి పార్టీ బలంగా ఉండాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్ బలమైన వ్యక్తి కావచ్చు. స్థానిక పరిస్థితులు ఉంటాయి. కూటమి వల్ల సీట్లు పెరుగుతాయి. మల్టీపుల్ కాంటెస్ట్ ల వల్ల కూడా సీట్లు గెలుస్తారు. తక్కువ ఓట్లతో సీట్లు గెలుస్తాయి.
కానీ కేవలం సీట్ల వల్ల మాత్రమే పార్టీ బలం తెలుసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఉదాహరణకు చూస్తే తమిళనాడులో ఈసారి కాంగ్రెస్ కు పోయినసారి కంటే ఒక సీటు ఎక్కువ వచ్చింది. 9 సీట్లు వచ్చాయి. ఓటింగ్ శాతం చూస్తే 10.7 శాతం మాత్రమే కావడం గమనార్హం. పోయినసారి కన్నా 2 శాతం తగ్గింది. ఓట్లు తగ్గినా సీట్లు పెరిగాయి.
పంజాబ్ లో కాంగ్రెస్ 13 సీట్లు పోటీచేస్తే 7 వచ్చాయి. ఓట్లు మాత్రం 14.3 శాతం తగ్గాయి. ఆంధ్రాలో బీజేపీకి 11.3 శాతం ఓట్లు వచ్చాయి.. 3 సీట్లు గెలిచింది. ఇది కూటమి బలం. కాబట్టి సీట్లకు.. పార్టీలకు సంబంధం లేదు.
సీట్ల కన్నా ఓట్లు చూస్తే బీజేపీ, కాంగ్రెస్ లు ఎలా వున్నాయి అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.