Bigg Boss 9 Telugu: బంధాలు , అనుబంధాలు మధ్య ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా సాగిన ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) రేపటితో ముగియబోతుంది. నేడు గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారు అనే విషయం రేపు రాత్రి టీవీ లో చూసి తెలుసుకోవడమే. లైవ్ గా ఈ షూటింగ్ ఉండేలా ప్లాన్ చేశారు. ఈరోజుకి అయితే హౌస్ నుండి ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ 5 స్థానం లో సంజన ఎలిమినేట్ అయ్యింది. ప్రముఖ హీరో శ్రీకాంత్, అతని తనయుడు రోషన్ ‘ఛాంపియన్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజి మీదకు వస్తారు. వీళ్ళిద్దరిని హౌస్ లోపలకు పంపించి సంజన ని బయటకు తీసుకొచ్చారట. బయటకు వచ్చిన తర్వాత సంజన ని నాగార్జున టాప్ 5 లో ఎలిమినేట్ అవుతానని ఊహించావా?, లేదా విన్నర్ అవుతానని అనుకున్నావా అని అడుగుతాడట.
అందుకు సంజన ‘విన్నర్ అవుతానని అనుకోలేదు కానీ , టాప్ 5 లో ఉన్నప్పుడు సూట్ కేసు వస్తే తీసుకుందామని మాత్రం అనుకున్నాను’ అని బదులిస్తుందట. ఇక టాప్ 4 కంటెస్టెంట్ గా ఎవరు నిలవబోతున్నారు అనే దానిపై ఆడియన్స్ లో తీవ్రమైన ఉత్కంఠ ఉంది. ఇమ్మానుయేల్ మరియు డిమోన్ పవన్ మధ్య టాప్ 4 స్థానానికి నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ జరిగిందట. అయితే టాప్ 4 కి బిగ్ బాస్ టీం సిల్వర్ సూట్ కేసు ఆఫర్ ని ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చి, సిల్వర్ సూట్ కేసు తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడట. ఈ సూట్ కేసు ఆఫర్ ని టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా స్వీకరించలేదు. చివరికి ఇమ్మానుయేల్ కి డిమోన్ పవన్ కంటే తక్కువ ఓటింగ్ ఉండడంతో టాప్ 4 స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు.
విన్నింగ్ రేస్ లో ఉండాల్సిన వాడు, టాప్ 4 లో ఎలిమినేట్ అవ్వడం ఆయన అభిమానులకు తీవ్రమైన బాధని కలిగించింది. కనీసం సూట్ కేసు ఆఫర్ ని అందుకొని బయటకు వచ్చినా బాగుండేది, కానీ అది కూడా జరగలేదంటూ అభిమానులు బాధపడుతున్నారు. ఈ సీజన్ లో ఇమ్మానుయేల్ ఆడినన్ని గేమ్స్, ఇమ్మానుయేల్ పంచినంత ఎంటర్టైన్మెంట్ ఏ కంటెస్టెంట్ కూడా పంచలేదు. హౌస్ లో పెట్టిన టాస్కులన్నిట్లో ఇమ్మానుయేల్ కి 99 % విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. అయినప్పటికీ కూడా టాప్ 4 లో ఎలిమినేట్ అవ్వడం బాధాకరం. ఇమ్మానుయేల్ కూడా తనూజ , కళ్యాణ్ లాగా లవ్ ట్రాక్స్ నడిపి ఉండుంటే విన్నర్ రేస్ లో ఉంచేవారేమో మన గొప్ప ఆడియన్స్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.