Calcutta High Court : మమతా బెనర్జీ.. కోల్ కతా.. పశ్చిమబెంగాల్… గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సంచలనాలు జరుగుతున్నాయి. కోల్ కతా హైకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చింది. సంచలనాత్మకమైన తీర్పు ఇదీ..
2016లో రాష్ట్రప్రభుత్వం రిక్రూట్ చేసుకున్న 26వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేసింది. 8 ఏళ్ల కిందటి ఈ నియామకాలను రద్దు చేయడమే కాకుండా.. ఎవరైతే టీచర్లు దొంగచాటుగా రిక్రూట్ చేయబడ్డారో వాళ్లు అందరూ 4 వారాలలోపు 12 శాతం వడ్డీతో సహా తీసుకున్న జీతాలు మొత్తం తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలి. 26వేల మంది టీచర్లు.. ఇది సాధ్యమా? అంటే కష్టమే.. కానీ తీర్పు అయితే వచ్చింది.
సీబీఐని మూడు నెలల్లో దర్యాప్తు కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. వారందరినీ ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. 26వేల పోస్టులు రద్దు చేయడం ఏంటి? వాళ్ల జీతాలు తిరిగి తీసుకోవడం ఏంటన్నది సంచలనమైంది.
కలకత్తా హైకోర్టు సంచలనాత్మక తీర్పు మమతా కి చెంపపెట్టు అని.. ఈ కేసు పూర్వపరాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.