https://oktelugu.com/

Cancer : యూరిన్ లో మార్పు వచ్చిందా? అయితే కాలేయ క్యాన్సర్ కావచ్చు..

ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయో ఊహించడం కూడా కష్టమే. కొత్త కొత్త వ్యాధులు, వైరస్ లు ఊహించని రేంజ్ లో ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తున్నాయి. కొన్ని సార్లు ప్రాణాలు కూడా వదలాల్సి వస్తుంది. శరీరంలో ఏ అవయవం అయినా సరే చేయాల్సిన పని చేయకుండా ఆగిపోయినా, ఎక్కువ చేసినా సరే అక్కడ ఏదో ఒక సమస్య వచ్చినట్టే. ఇక బాడీలో ఏ సమస్య వస్తుందో ఊహించడం కూడా కష్టమే కదా. కొన్ని సార్లు ఫివర్ అని ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ అని కూడా తెలుస్తుంది. పెద్ద పెద్ద వ్యాధుల గురించి తెలిసి బాద పడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు క్యాన్సర్ గురించి తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 4, 2024 / 01:46 PM IST

    Is there a change in urine? But it could be liver cancer..

    Follow us on

    Cancer : లివర్‌కి ఎటాక్ అయ్యే ప్రమాదకర వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. ఏ సమయంలో అయినా.. ఎప్పుడైనా కాలేయానికి క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లివర్‌ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తెలుసుకొని మరీ వాటిని తినడం చాలా అవసరం. అయితే ప్రస్తుత కాలంలో పలు దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఎటాక్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో క్యాన్సర్ ప్రధాన సమస్య. క్యాన్సర్ వచ్చేముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ముందుగానే వాటిని పసిగడితే క్యాన్సర్‌ ప్రారంభ దశలో ఉన్నప్పుడే దానికి పులిస్టాప్ పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటి అనుకుంటున్నారా?

    శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా లివర్ క్యాన్సర్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్య వల్ల మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. కానీ లివర్‌కి క్యాన్సర్ ఎటాక్ అయ్యే ముందు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు. లివర్ క్యాన్సర్‌ వస్తే ప్రారంభ లక్షణాల్లో కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. కుడి వైపు ఎక్కువగా ఎప్పుడూ లేనంతగా అసౌకర్యంగా ఉంటుంది. ఈ ప్లేస్ లో నొప్పిగా వస్తుంది. ఇలాంటి సమస్య ఉంటే అసలు అశ్రద్ద చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

    లివర్ క్యాన్సర్ వచ్చే ముందు కామెర్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది. కళ్లు, చర్మం, గోర్ల రంగు పసుపు పచ్చ రంగులోకి మారుతుంటుంది. కాబట్టి కామెర్లు వచ్చినా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. అంతేకాదు అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా లివర్ క్యాన్సర్‌కు కారణం అయ్యే అవకాశం ఉంది. అలసట, వాంతులు, వికారం వంటి సమస్యలు ఉన్నా సరే లివర్ క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. మరో ముఖ్యమైన విషయం మీ మూత్రం ముదురు రంగులో వస్తున్నా కూడా లేట్ చేయకుండా టెస్టులు చేయించుకోవడం చాలా మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు.